సత్యదేవుడి హుండీల ఆదాయం రూ.1.52 కోట్లు
ABN , Publish Date - Dec 31 , 2024 | 12:40 AM
అన్నవరం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): వివిధ ప్రాంతాల నుంచి అన్నవరం సత్యదేవుడి సన్నిధికి విచ్చేసిన భక్తులు హుండీలలో సమర్పించిన కానుకలను సో

అన్నవరం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): వివిధ ప్రాంతాల నుంచి అన్నవరం సత్యదేవుడి సన్నిధికి విచ్చేసిన భక్తులు హుండీలలో సమర్పించిన కానుకలను సోమవారం లెక్కించగా రూ.1,52,58,438 నగదు, 16.8 గ్రాముల బంగా రం, 745 గ్రాముల వెండి సమకూరాయి. వీటితో పాటుగా యూఎస్‌ఏకు చెందిన 1901 డాలర్లు, మలేషియా 105, సౌదీఅరేబియా 1230, మరికొన్ని విదేశీ కరెన్సీ లభ్యమయ్యాయి. లెక్కింపును ఈవో సుబ్బారావు, చైర్మన్ రోహిత్‌లు పర్యవేక్షించగా సిబ్బంది లెక్కించారు. 28రోజులకు ఈ ఆదాయం సమకూరగా సరాసరిన రోజుకు భక్తు లు రూ.5.44 లక్షలు కానుకల రూపంలో హుండీలలో వేసినట్టు ఈవో సుబ్బారావు తెలిపారు.