పాలన.. గాడినపడేనా?
ABN , Publish Date - Dec 19 , 2024 | 12:45 AM
అన్నవరం, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో గత కొంతకాలంగా అస్తవ్యస్తంగా మారిన పాలన నూతన ఈవో రాకతో గాడిన పడుతుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. వైసీపీ హయాంలో సుమారు రూ.6కోట్లు అనవసర వ్యయమయింది. అనంతరం గతేడాది కార్తీకమాసంలో రామచంద్రమోహన్ బాధ్యతలు స్వీకరించినా ప్రధాన కార్యాలయంలో అడిషనల్ కమిషనర్‌గా బాధ్యతలు ఉండడంతో వారంలో రెండురోజులు
అన్నవరం దేవస్థానంలో
ఈవోలు మారినా పాలన అస్తవ్యస్తం
ఆదాయం వస్తున్నా అనవసర
వ్యయాలతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం
మార్పులకు శ్రీకారం చుట్టిన
నూతన ఈవో సుబ్బారావు
అన్నవరం, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో గత కొంతకాలంగా అస్తవ్యస్తంగా మారిన పాలన నూతన ఈవో రాకతో గాడిన పడుతుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. వైసీపీ హయాంలో సుమారు రూ.6కోట్లు అనవసర వ్యయమయింది. అనంతరం గతేడాది కార్తీకమాసంలో రామచంద్రమోహన్ బాధ్యతలు స్వీకరించినా ప్రధాన కార్యాలయంలో అడిషనల్ కమిషనర్‌గా బాధ్యతలు ఉండడంతో వారంలో రెండురోజులు మాత్రమే అన్నవరం విచ్చేసి మిగిలినరోజులు ఈ ఫైలింగ్, చరవాణిలా ద్వారా పాలనను నడిపించారు. అన ంతరం ఆయనను దేవదాయశాఖ ప్రధాన కార్యాలయానికి పరిమితం చేసి అన్నవరం దేవస్థానం ఈవోగా సింహాచలం ఈవోగా ఉన్న వేండ్ర త్రినాఽథరావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయనపై కూడా రెండు ప్రధానాలయాల బారం పడడంతో పూర్తిస్థాయి దృష్టిసారించే అవకాశం లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్న వీర్ల సుబ్బారావు అన్న వరం దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా ఈనెల 14న బాధ్యతలు స్వీకరించారు. అయితే సుబ్బారా వు కొన్ని మార్పులకు శ్రీకారం చుట్టారు. గత 4 రోజులుగా ఆయన ప్రతీ విభాగాన్ని క్షేత్రస్థాయిలోకి వెళ్లి అధ్యయనం చేస్తూ ఆయా విభాగాల పనితీరుపై అవగాహన కల్పించుకుంటూ పాలన సాగిస్తున్నారు. ముందుగా ఆయన తీసుకున్న ని ర్ణయం అప్పటివరకు ప్రతి ఫైలు గుమాస్తా వద్దనుంచి ఏఈవోకు చేరుకున్న తరువాత నేరుగా ఈవోకు చేరేది. అయితే ఈ విధానం తప్పని గ్రహించి పారదర్శకత కోసం సహాయ కమిషనర్, డిప్యూటీ కమిషనర్‌కు చేరిన తరువాతే తన వద్దకు పంపాలని ఆదేశించారు. దీంతో కొన్ని వర్గాలకు ఈ విధానం మింగుడుపడకపోవడంతో పా లన గాడినపడుతున్నట్టేనని చర్చించుకుంటున్నా రు. ముందుగా ఆలయంలో విభాగాలు ఎన్ని ఉన్నాయి, వాటి నిర్వహణ తీరు ఏవిధంగా ఉంది తెలుసుకుని నేరుగా ఆయా విభాగ కార్యాలయానికి చేరుకుని క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. మరికొన్ని విభాగాలకు సంబంధిత విభాగ ఏఈవో, సూపరెంటెండెంట్‌ను కార్యాలయానికి పి లిపించి మాట్లాడడం చేస్తుండడంతో కిందిస్థాయి ఉద్యోగుల్లో గుబులు ప్రాంభమైంది. మరో 15 రోజులు గడిస్తే పూర్తిస్థాయిలో అవగాహన కల్పించుకుని పాలన పరుగులు పెట్టించేవిధంగా అడు గులు పడతాయని భావిస్తున్నారు. అయితే రాజకీయనేతలు పాలనా వ్యవహారాల్లో వేలు పెట్టనంతవరకు సవ్యంగానే నడుస్తుందని లేకుంటే య థావిధిగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నవిదంగా తయారవుతుందనడంలో సందేహం లేదు.
ఆందోళనకరంగా ఆర్థిక పరిస్థితి...
ప్రధానంగా అన్నవరం ఆలయంలో ఆర్థిక పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. గత అధికారులు ఇష్టారీతిన అనవసర వ్యయం చేయడం వాటికి నేడు చెల్లింపులు చేపట్టడంతో బడ్జెట్ మించిపోయింది. దీంతో మిగిలిన నాలుగు నెలలు ఏవిఽ దంగా నెట్టుకురావాలో అర్థంకాని ప్రశ్న. దీనికి సంబంధించి సప్లమెంటరీ బడ్జెట్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అన్నవరం ఆలయంలో గత 3 దశాబ్దాలుగా ఏటా స్వామివారి పేరున మిగులు నిధు లు డిపాజిట్ చేసేవారు. కరోనా వంటి కష్టకాలం లో కూడా డిపాజిట్లను విత్‌డ్రాయల్ చేయకుండా చూశారు. ఈ ఏడాది మాత్రం సుమారు రూ.5 కోట్లు వరకు డిపాజిట్లను క్యాన్సిల్ చేయడంతో అ న్నవరం ఆలయ ఆర్థిక పరిస్థితి ఏవిధంగా మారి ందో అర్థం చేసుకోవచ్చు. వచ్చే ఏడాది మార్చివరకు అనవసర ఖర్చులు తగ్గించి ఆదాయ మార్గా లు పక్కకు వెళ్లకుండా దేవస్థానం ఖజానాకు చేరి తే ఆర్థిక పరిస్థితి కొంత మెరుగవ్వచ్చు. ఏది ఏమై నా ఏడాది కాలానికి డిప్యుటేషన్‌పై వచ్చిన నూత న ఈవో సుబ్బారావు సవాళ్లతో కూడిన పాలన చేయాల్సి వస్తుంది. ఆయనకు సత్యదేవుడి ఆశీస్సు లు మెండుగా ఉండాలని, భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆశిద్దాం.