అన్నవరం దేవస్థానంలో నగదు రహిత సేవలకు మోక్షం
ABN , Publish Date - Dec 30 , 2024 | 12:34 AM
అన్నవరం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో నగదు రహిత సేవలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ప్రస్తుత కాలంలో ప్రతిఒక్కరూ ఫో న్, పే, గుగూల్ పే తదితర వాటి ద్వారా లావాదేవీలు జరుపుతున్నా అన్నవరం దేవస్థానంలో ఇప్పటివరకు అటువంటి సౌకర్యం కల్పించకపోవడం
రెండు కౌంటర్ల ఏర్పాటు
అన్నవరం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో నగదు రహిత సేవలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ప్రస్తుత కాలంలో ప్రతిఒక్కరూ ఫో న్, పే, గుగూల్ పే తదితర వాటి ద్వారా లావాదేవీలు జరుపుతున్నా అన్నవరం దేవస్థానంలో ఇప్పటివరకు అటువంటి సౌకర్యం కల్పించకపోవడంతో భక్తులు అనేక ఇబ్బందులకు గురయ్యేవారు. దీనిపై ఆంధ్రజ్యోతి, ఇతర మీడియాలలో కథనాలు వెలువడ్డాయి. ఈవో సుబ్బారావు బా ధ్యతలు స్వీకరించాక భక్తుల ఇబ్బందులు దృష్టి లో ఉంచుకుని రిసెప్షన్ కార్యాలయం, పశ్చిమరాజగోపురం వద్ద కౌంటర్లను ఏర్పాటు చేశామని.. భక్తులు వ్రతాలు, దర్శనం టిక్కెట్లు, విరాళాలు, వసతి సౌకర్యం కోసం ఇకపై డిజిటల్ పేమెంట్‌ల ద్వారా చెల్లింపులు చేపట్టవచ్చని దేవస్థానం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
నేడు హుండీల లెక్కింపు
సత్యదేవుడి సన్నిధిలో భక్తులు హుండీలలో సమర్పించిన కానుకలను సోమవారం లెక్కించనున్నట్టు అధికారులు తెలిపారు. సిబ్బంది విధిగా హాజరుకావాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
నిత్యాన్నదానానికి విరాళాలు
అన్నవరం దేవస్థానంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సత్యదేవ నిత్యాన్నదాన పథకానికి ఆదివారం ఇద్దరి దాతల నుంచి రూ.2 లక్షలు విరాళంగా సమకూరాయి. కాకినాడకు చెందిన ముప్పిడి సత్యవాణి రూ.లక్ష ఈవో సుబ్బారావు, చైర్మన్ రోహిత్‌కు అందజేశారు. తెలంగాణ రా ష్ట్రం సికింద్రాబాద్‌కు చెందిన కాలా కార్తీకేయ దత్త రూ.1,01,116లు దేవస్థానం పీఆర్వో కృష్ణారా వుకు అందించగా దాతలను అభినందించారు.