AP News: ఆ డీఎస్పీలను మార్చాలని నిర్ణయించిన ప్రభుత్వం
ABN , Publish Date - Dec 08 , 2024 | 09:59 AM
అమరావతి: రేషన్ బియ్యం స్మగ్లింగ్‌పై నియమించిన సీట్‌లో వైఎస్సార్‌సీపీ సానుకూల డీఎస్పీలను నియమించిన అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది. డీఎస్పీలను మార్చాలని నిర్ణయించింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్సార్‌సీపీతో అంట కాగిన డీఎస్పీలను వీఆర్‌కు ప్రభుత్వం పంపింది.
అమరావతి: రేషన్ బియ్యం స్మగ్లింగ్ (Ration Rice Smuggling )పై నియమించిన సిట్ (SIT)లో వైఎస్సార్‌సీపీ (YSRCP) సానుకూల డీఎస్పీ (DSP)లను నియమించిన అంశంపై ప్రభుత్వం (AP Govt.) దృష్టి సారించింది. డీఎస్పీలను మార్చాలని నిర్ణయించింది. వైఎస్సార్‌సీపీ సానుకూల డీఎస్పీలను నియమించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. వారిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లువెత్తాయి. వారితో దర్యాప్తు చేయిస్తే స్మగ్లింగ్ కేసులో నిజాలు బయటకు రావని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎమ్మెల్యేలు నేరుగా ఫిర్యాదులు చేశారు. కాగా టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్సార్‌సీపీతో అంట కాగిన డీఎస్పీలను వీఆర్‌కు ప్రభుత్వం పంపింది. కాగా వీఆర్‌లో ఉన్న ముగ్గురిని ప్రభుత్వం సీట్‌లో నియమించింది. దీనిపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో కథనాలు ప్రసారమయ్యాయి. దీంతో డీఎస్పీ లను మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కాగా పోర్టు కేంద్రంగా జరుగుతున్న పీడీఎస్ బియ్యం అక్రమ రవాణపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పీడీఎస్ బియ్యం స్మగ్లింగ్ పై సమగ్ర విచారణ జరగాలనే ఉద్దేశంతో సీబీసీఐడీ ఎంక్వైరీకి సీఎం చంద్రబాబు ఆదేశించారని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు 1066 కేసులు నమోదు చేశామన్నారు. దీని ద్వారా 62 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశామని తెలిపారు. సీజ్ చేసిన బియ్యం విలువ బహిరంగ మార్కెట్‌లో 240 కోట్ల రూపాయలు ఉంటుందన్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దాడుల్లో 1066 కేసులు నమోదు చేశామని నాదెండ్ల మనోహర్ అన్నారు. 1066 కేసుల్లో 62వేల మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ చేయడం జరిగిందని, దాని మార్కెట్ విలువ రూ.240 కోట్ల ఉంటున్నారు. అయినా, వాళ్లు చేస్తున్న అరాచకంలో అది చాలా చిన్న శాతం అని తాము భావిస్తున్నామన్నారు. ఒక్క కాకినాడ పోర్టు నుంచే గత మూడేళ్లలో కోటి 31 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి జరిగిందని తెలిపారు.
అక్కడ స్మగ్లింగ్ డెన్‌గా ఏర్పాటు చేసుకుని రాష్ట్రానికి, ప్రజలకు నష్టం కలిగించే విధంగా వారు పరిపాలించిన విధానం అందరికీ తెలిసిందేనని నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరపున.. కాకినాడలో జరిగిన సంఘటనలను, ఈ రాష్ట్రంలో జరుగుతున్న పీడీఎస్ కేసులు, స్మగ్లింగ్ పైన తాము నమోదు చేసిన కేసులు.. వీటిపై సమగ్ర విచారణ జరగాలనే ఉద్దేశంతో సీబీసీఐడీ విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
‘‘రాష్ట్రవ్యాప్తంగా రైస్ మిల్లర్లను తాము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి, పీడీఎస్ రైస్ స్మగ్లింగ్ లో కానివ్వండి.. మీరు ప్రభుత్వంతో పాటు కలిసి పని చేయాల్సిందే. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అమలు చేసే విధంగా, నిజాయితీగా, పారదర్శకంగా వ్యాపారాన్ని చేస్తే ఎక్కడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టం. ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యే విధంగా మీరు నిలబడాలి. అంతేకానీ, ప్రభుత్వపు వ్యతిరేకత తెచ్చే కార్యక్రమాల్లో పాల్గొంటే కచ్చితంగా వాళ్లపై యాక్షన్ తీసుకుంటాం” అని మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బీజాపూర్ జిల్లాలో పోలీస్ బేస్ క్యాంప్‌పై మావోయిస్టుల దాడి
కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ చార్జ్ షీట్
బోరుగడ్డ అనిల్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News