Share News

Deputy CM: పిఠాపురంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్

ABN , Publish Date - Jul 01 , 2024 | 11:18 AM

పిఠాపురం: ఏపీ వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్దిదారులకు పెన్షన్లు అందజేస్తున్నారు.

Deputy CM: పిఠాపురంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్

పిఠాపురం: ఏపీ (AP) వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ( Pensions Distribution Programme) ప్రారంభమైంది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం (Deputy CM) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సోమవారం పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్దిదారులకు పెన్షన్లు అందజేస్తున్నారు. పవన్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకుని.. అక్కడి నుంచి గొల్లప్రోలుకు బయలుదేరి వచ్చారు.


అంతకుముందు డిప్యూటీ సీఎం (Deputy CM) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరికీ డాక్టర్స్ డే (Doctors Day) సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రాణాంతక కరోనా మహమ్మారి మానవాళిపై విరుచుకుపడ్డప్పుడు డాక్టర్లు చేసిన సేవలు విస్మరించలేనివని అన్నారు. మన దేశంలో దాదాపు 1600 మంది వైద్యులు కరోనా (Corona) బారినపడి ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని అందరం గుర్తుంచుకోవాలన్నారు. డాక్టర్లు తమ దగ్గరకు వచ్చిన రోగులపట్ల ప్రత్యేక శ్రద్ధను, సంరక్షణను చూపించాలని, అదే విధంగా రోగులు సైతం వైద్యులపట్ల బలమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలని సూచించారు. అటు వైద్యులు, ఇటు రోగులు పరస్పరం గౌరవపూర్వకమైన భావనను పెంపొందించుకోవాలన్నారు.


దురదృష్టవశాత్తూ ఇటీవలి కాలంలో వైద్యులపైనా, ఆసుపత్రులపైనా దాడులు చోటు చేసుకొంటున్నాయని, ఇటువంటి అవాంఛనీయమైన ఘటనల నుంచి రక్షణ అవసరమని వైద్య నిపుణులు కోరుతున్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. వైద్యులకు రక్షణ కల్పించాల్సిన అంశాన్ని, వైద్య వృత్తిలో ఉన్నవారికి రక్షణ ఇస్తున్న చట్టం అమలు విషయాన్ని రాష్ట్ర కేబినెట్ ముందుకు తీసుకువెళ్తానని స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇప్పుడు ప్రజా ముఖ్యమంత్రిని చూస్తున్నాం: లోకేష్

దేశ చరిత్రలో కొత్త అధ్యాయం..

జగన్ ఆ మాట చెప్పినప్పుడు ఏడ్చాను..

చంద్రబాబు చేసి చూపించారు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 01 , 2024 | 11:18 AM