పాఠశాలలను ఉన్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
ABN , Publish Date - Oct 18 , 2024 | 11:41 PM
పిఠాపురం, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): పాఠశాలల్లో స్థితిగతులను పరిశీలించడంతో పాటు అక్కడ చేపట్టాల్సిన పనులు, కల్పించాల్సిన మౌలి క సదుపాయాలపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ మరోమారు దృష్టిసారించారు. పవన్ ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం కార్యాలయ అధికారి శివరామప్రసాద్ శుక్రవారం పిఠాపురంతో పాటు కొ త్తపల్లి మండలంలో పర్యటించారు. పట్టణంలోని బాదం మాధవరావు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్ ప్రభుత్వ ఉన్నత పా
పిఠాపురంలో పర్యటించిన డిప్యూటీ సీఎం పేషీ అధికారి శివరామప్రసాద్
పిఠాపురం, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): పాఠశాలల్లో స్థితిగతులను పరిశీలించడంతో పాటు అక్కడ చేపట్టాల్సిన పనులు, కల్పించాల్సిన మౌలి క సదుపాయాలపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ మరోమారు దృష్టిసారించారు. పవన్ ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం కార్యాలయ అధికారి శివరామప్రసాద్ శుక్రవారం పిఠాపురంతో పాటు కొ త్తపల్లి మండలంలో పర్యటించారు. పట్టణంలోని బాదం మాధవరావు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సహా పలు పాఠశాలలను సందర్శించారు. అక్కడ పరిస్థితులు, నాడు-నేడు పనులు ఎంత వరకూ జరిగాయి, క్రీడా మైదానాలు, రోడ్లు, డ్రెయిన్లు, తాగునీరు, విద్యుత్ సరఫరా, ల్యాబ్‌లు ఏర్పాటు, ఫర్నీచర్, ఇతర సదుపాయాల కల్పనపై పరిశీలన చేశారు. నియోజకవర్గంలోని 52 పాఠశాలలను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు నిర్ణయించి అక్కడ కల్పించాల్సిన మౌలిక సౌకర్యాలు, తరగతి గదుల నిర్మాణం తదితరాలపై దృష్టిపెట్టారు. మధ్యలో నిలిచిపోయిన నాడు- నేడు పనులను ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని, ఇందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఎంఈ వోలకు సూచించారు. పాఠశాలలను అన్ని సదుపాయాలతో ఉన్నతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పవన్ ఉన్నారని ఆయన తెలిపారు. పాఠశాలలతో పా టు వసతిగృహాలు, ఆసుపత్రులు, పీహెచ్‌సీలపై పవన్ దృష్టి పెట్టారు. అనంతరం ఎంఈవోలతో సమావేశమై పాఠశాలల వారీగా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి ఎంఈవోలు శ్యాంబాబు, శివప్రసాద్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.