Share News

తల్లిదండ్రులు, గురువులను మరువరాదు : ఆర్‌జేడీ

ABN , Publish Date - Oct 20 , 2024 | 12:23 AM

గొల్లప్రోలు రూరల్‌, అక్టోబరు 19(ఆంధ్ర జ్యోతి): జీవితంలో ఎంత ఉన్నతస్థాయికి ఎది గినా జన్మనిచ్చిన తల్లిదండ్రులు, విజ్ఞానాన్ని పంచిన గురువులను మరువరాదని విద్యాశాఖ రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ జి.నాగమణి సూచి ంచారు. గొల్లప్రోలు మండలం ఏకే మల్లవరం జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలను ఆమె శనివారం

తల్లిదండ్రులు, గురువులను మరువరాదు : ఆర్‌జేడీ
విద్యార్థులతో మాట్లాడుతున్న ఆర్‌జేడీ

గొల్లప్రోలు రూరల్‌, అక్టోబరు 19(ఆంధ్ర జ్యోతి): జీవితంలో ఎంత ఉన్నతస్థాయికి ఎది గినా జన్మనిచ్చిన తల్లిదండ్రులు, విజ్ఞానాన్ని పంచిన గురువులను మరువరాదని విద్యాశాఖ రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ జి.నాగమణి సూచి ంచారు. గొల్లప్రోలు మండలం ఏకే మల్లవరం జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలను ఆమె శనివారం తనిఖీ చేశారు. 3,4,5 తరగతుల్లో విద్యార్థుల అభ్యాసనా శక్తిని పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఏప్రిల్‌లో జరిగిన పరీక్షల్లో 98 శాతం ఉత్తీర్ణత సాధించడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఆమె వెంట ఎంఈవో-2 శివప్రసాద్‌, హెచ్‌ఎం చం ద్రశేఖరరావు, సీఆర్‌ఎంటీ రామకృష్ణ ఉన్నారు.

Updated Date - Oct 20 , 2024 | 12:23 AM