వెరీ‘గుడ్డు’
ABN , Publish Date - Dec 01 , 2024 | 11:55 PM
అనపర్తి/సామర్లకోట, డిసెంబరు 1 (ఆంధ్ర జ్యోతి): దాణా రేట్లు, నిర్వహణా ఖర్చులు గణనీ యంగా పెరగడంతో రెండేళ్లుగా కోళ్ల పరిశ్రమ న ష్టాల్లో నడిచింది. ప్రస్తుతం గుడ్డు ధర రూ.6.08 పైసలకు పెరగడంతో రైతులు కొంత మేర ఊపిరి పీల్చుకుంటున్నారు. 15 నుంచి 20 రోజులుగా ఈ ధర అటు ఇటుగా ఉన్నప్పటికీ రైతుకు కొంత మే ర ప్రయోజనం చేకూరుతోంది. గోదావరి జిల్లాల్లో పెద్ద చిన్న ఫారాలు సుమారుగా 300నుంచి 350 వరకు ఉన్నాయి. వీటిలో సుమారుగా 1.5 కోట్ల కోళ్లు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు సుమారు 1 కోటి వరకు ఉత్పత్తి అవుతుండగా వీటిలో 40 శాతం వరకు స్థానిక అవసరాలకు

కోడి గుడ్డు ధర అదరహో
రూ.6.08 పైసలు పలుకుతున్న వైనం
రిటైల్‌గా రూ.7కు విక్రయం
అనపర్తి/సామర్లకోట, డిసెంబరు 1 (ఆంధ్ర జ్యోతి): దాణా రేట్లు, నిర్వహణా ఖర్చులు గణనీ యంగా పెరగడంతో రెండేళ్లుగా కోళ్ల పరిశ్రమ న ష్టాల్లో నడిచింది. ప్రస్తుతం గుడ్డు ధర రూ.6.08 పైసలకు పెరగడంతో రైతులు కొంత మేర ఊపిరి పీల్చుకుంటున్నారు. 15 నుంచి 20 రోజులుగా ఈ ధర అటు ఇటుగా ఉన్నప్పటికీ రైతుకు కొంత మే ర ప్రయోజనం చేకూరుతోంది. గోదావరి జిల్లాల్లో పెద్ద చిన్న ఫారాలు సుమారుగా 300నుంచి 350 వరకు ఉన్నాయి. వీటిలో సుమారుగా 1.5 కోట్ల కోళ్లు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు సుమారు 1 కోటి వరకు ఉత్పత్తి అవుతుండగా వీటిలో 40 శాతం వరకు స్థానిక అవసరాలకు వినియోగి స్తుండగా మిగిలిన వాటిని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. నెక్ ధర రూ.6.08పైసలు ఉన్నప్పటికీ ట్రేడ ర్లు మాత్రం ఈ ధరకు రూ.0.25 పైసలు తగ్గించి కొంటున్నారు. మరో 2శాతం కమిషన్ రూపంలో పోవడంతో రైతుకు 5.80పైసలు మాత్రమే అందు తుంది. అయితే పేపర్ రేటు ఎక్కు వగా ఉండడంతో రిటైల్ మార్కెట్‌లో విని యోగదారుడు మాత్రం రూ.7 వెచ్చించి గుడ్డును కొనుగోలు చేస్తున్నాడు. అయితే దేశం మొత్తం పంజాబ్ మార్కెట్‌పై ఆధారపడి ఉంటుందని, అక్కడ ధర ఉన్నంత వరకే ఇక్కడ ధర ఉంటుందని, ఎన్ని రోజుల పాటు ఈ ధర నిల బడుతుంతో చెప్పలేమని రైతులు చెబుతున్నారు. రెండు మూడేళ్లలో బ్యా చ్‌ల సంఖ్య గణనీయంగా తగ్గించడంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉత్పత్తి కూడా తగ్గు ముఖం పట్టింది. గుడ్డు తయారీకి సుమారుగా రూ.5 వరకు ఖర్చు అవుతుందని, అయితే ఏడాదిలో కనీసం రెండు మూడు నెలలు కూడా గిట్టుబాటు ధర ఉండడం లేదని, మిగిలిని తొమ్మిది మాసాల్లో నష్టాలు చవి చూస్తున్నామని రైతులు అంటున్నారు. దీనికి తో డు నూకలు, మొక్కజొన్నలు దొరడంలేదని, దొరి కినా కొనలేని స్థితిలో ఉన్నామని వాపోతున్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా రైతులకు అనేక రాయితీలు అందేవని, ఐదేళ్లుగా వైసీపీ పా లనలో ఒక్క రాయితీ కూడా లేకుండా చేశారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కనీసం నూకలు, మొక్కజొన్న రాయితీ ధరకు అందిస్తే పరిశ్రమ మనుగడ సాగిస్తుందని రైతులు కోరుతున్నారు.