ప్రజాస్వామ్యంలో ఓటుకు ప్రాధాన్యం
ABN , Publish Date - Nov 24 , 2024 | 12:07 AM
సర్పవరం జంక్షన్, నవంబరు 23: ప్రజాస్వామ్యంలో ఓటుకు అత్యంత ప్రాధాన్యం ఉందని, అర్హులైన ప్రతీ ఒక్కరూ ఓటు నమోదు చేసుకుని ఓటనే వజ్రాయుఽదాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎలక్షన్ కమిషన్ జాయింట్ సీఈవో, జిల్లా ప్రత్యేకాధికారి ఏ.వెంకటేశ్వరరావు కోరారు. శనివారం కాకినాడ రూరల్ తిమ్మాపురం
ఎలక్షన్ కమిషన్ జాయింట్ సీఈవో
సర్పవరం జంక్షన్, నవంబరు 23: ప్రజాస్వామ్యంలో ఓటుకు అత్యంత ప్రాధాన్యం ఉందని, అర్హులైన ప్రతీ ఒక్కరూ ఓటు నమోదు చేసుకుని ఓటనే వజ్రాయుఽదాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎలక్షన్ కమిషన్ జాయింట్ సీఈవో, జిల్లా ప్రత్యేకాధికారి ఏ.వెంకటేశ్వరరావు కోరారు. శనివారం కాకినాడ రూరల్ తిమ్మాపురం రాజీవ్‌గాంధీ ఎంబీఏ కాలేజీలో స్పెషల్ సమ్మరీ రివిజన్ ఆఫ్ ఎలక్షన్ రోల్స్- 2025లో భాగంగా ఈనెల 23-24 తేదీల్లో జరిగే ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో ఎస్.మల్లిబాబు ఆధ్యక్షతన జరిగిన స్వీప్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు నమోదు కార్యక్రమం నిరంతరం జరిగే ప్రక్రియ అన్నారు. మరణించిన ఓటర్లను జాబితా నుంచి తొలగించాలన్నారు. ప్రతీ పౌరుడు బాధ్యతగా ఓటు నమోదు చేసుకుని, ఓటును వినియోగించుకోవాలని అప్పుడే బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంటుందన్నారు. తహశీల్దార్ ఎస్‌ఎల్‌ఎన్ కుమారి, రాజీవ్‌గాంధీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ వెంకటరావు పాల్గొన్నారు.