Home » Kakinada Rural
నౌ..కాకినాడ.. ఈ టైమ్ కాకినాడది.. అవును మరి నిజమే.. ఎందుకంటే షిప్ తయారీ కేంద్రంగా మారనుంది.. ఆ కేంద్రం అంటే మాటలా.. మన రాష్ట్రంలో ఒక్క విశాఖలో మాత్రమే ఉంది.. ఇప్పుడు కాకినాడలోనూ అడుగులు పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం ప్రకటించిన మారిటైం బోర్డు పాలసీలో నౌకల నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.. ఈ నేపథ్యంలో ఆ కేంద్రానికి కాకినాడ అనుకూలంగా ఉంటుందని ప్రతిపాదనలు పంపారు. దీంతో కాకినాడ టైం నేడో రేపో మారనుంది.. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు..
కాకినాడ సీపోర్టులో వాటాలనే కాదు, కాకినాడ సెజ్‌లో అరబిందో నిర్మిస్తున్న గేట్‌వే పోర్టు కోసం కొండనూ కొట్టేశారు. జగన్ ప్రభుత్వంలో కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ములగపూడి గ్రామ పరిధిలో మొత్తం 125 ఎకరాల్లో....
కాకినాడ పోర్టులోని తమ పారా బాయిల్డ్ రైస్‌ను ఎంవీ స్టెల్లా నౌకలోకి ఎగుమతి చేసేందుకు అనుమతించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన మూడు వేర్వేరు..
సర్పవరం జంక్షన్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): క్రీడలతో దేహదారుఢ్యం.. మానసికోల్లాసం లభిస్తుందని ఏపీఎస్పీ కమాండెంట్, ఐపీఎస్ అధికారిణి ఎం.దీపిక అన్నారు. కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్ ప్రాంగణంలో సోమవారం యాన్సువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2024ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిత్యం పని ఒత్తిడితో బెటాలియన్ పోలీసులు బిజీగా ఉంటారని, కుటుంబాలకు దూరంగా ఉంటూ విధులు నిర్వహిస్తుంటారన్నారు. ఒ
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో దారుణం జరిగింది. ఇంటి నిర్మాణం విషయమై రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ఒక వర్గానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కత్తిపోట్లకు గురై దుర్మరణం చెందారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూసిన వైసీపీ మొట్టమొదటిసారిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది.
శాసనమండలి తూర్పు, పశ్చిమగోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి బొర్రా గోపీమూర్తి ఘన విజయం సాధించారు.
విదేశాలకు రేషన్ బియ్యం ఎగుమతి చేయకుండా అడ్డుకునేందుకు కాకినాడ సీపోర్టులో త్వరలో కొత్తగా చెక్‌పోస్టు ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
పేరుకు మాత్రం ప్రజాప్రతినిధి.. చేసిందంతా దౌర్జన్యాలు, దందాలు, బెదిరింపులు, కబ్జాలు. దీనికితోడు అడ్డగోలు తెంపరితనం. పైగా అప్పటి ముఖ్యమంత్రి జగన్‌కు అత్యంత సన్నిహితుడిననే తలపొగరు. వెరసి పెన్షనర్స్ ప్యారడైజ్‌గా పిలిచే కాకినాడలో కడప తరహా సంస్కృతి తీసుకువచ్చారు.
అధికారం అండతో అరాచకం.. వ్యవస్థలను అడ్డం పెట్టుకుని విచ్చల విడితనం.. కన్నేసిన ప్రతిదాన్నీ కబ్జా చేసే నియంతృత్వం.. అందుకోసం ఎంతకైనా తెగించే తత్వం.. కాకినాడ సీ పోర్టును హస్తగతం చేసుకోవడానికి అప్పటి సీఎం జగన్ అచ్చం ఇలాగే జగన్నాటకం ఆడారు.