లోవ దేవస్థానం అభివృద్ధికి కృషి : యనమల
ABN , Publish Date - Oct 03 , 2024 | 11:48 PM
తుని రూరల్, అక్టోబరు 3: తలుపులమ్మ లోవ దేవస్థానం అభివృద్ధికి పాటుపడతామని, ఆల యాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ఈ క్షేత్రాన్ని గొప్ప టూరిజం కేంద్రంగా మారుస్తామని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. గురువారం శరన్నవరాత్రి వేడుకలను పురస్కరించుకుని ఆలయానికి వచ్చిన య నమలకు అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని కూటమి నేతలతో కలిసి ఆయన దర్శించుకున్నారు.
తుని రూరల్, అక్టోబరు 3: తలుపులమ్మ లోవ దేవస్థానం అభివృద్ధికి పాటుపడతామని, ఆల యాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ఈ క్షేత్రాన్ని గొప్ప టూరిజం కేంద్రంగా మారుస్తామని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. గురువారం శరన్నవరాత్రి వేడుకలను పురస్కరించుకుని ఆలయానికి వచ్చిన య నమలకు అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని కూటమి నేతలతో కలిసి ఆయన దర్శించుకున్నారు. నూతన ఆలయ పను లు పరిశీలించి భవిష్యత్‌లో భక్తుల అవసరాలు, లోవ క్షేత్ర మాస్టర్ ప్లాన్‌పై అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గొర్లి అచ్చి య్యనాయుడు, యనమల రాజేష్, టీడీపీ సీనియర్ నేత కరపా అప్పారావు, దూలం మాణి క్యం, సుర్ల లోవరాజు, మోతుకూరి వెంకటేష్, యాదాల లోవకృష్ణ, యాదాల రామకృష్ణ, పప్పు నవీన్ పాల్గొన్నారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడిని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. తేటగుంట యనమల క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యి పలు రాజకీయ అంశాలు, నామినేటెడ్ పదవుల నియామకాలపై యనమలతో చర్చించినట్టు తెలిపారు.