పోలీసులపై ఎటాక్ చేసిన దొంగ నోట్ల ముఠా అరెస్టు
ABN , Publish Date - Dec 18 , 2024 | 12:36 AM
రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): తప్పించుకుందామని పోలీసులపై ఎటాక్ చేస్తే అసలు డొంక కదిలింది.. భీమవరం కేంద్రంగా సాగుతున్న పెద్ద దొంగ నోట్ల ముఠా బయటపడింది. రాజమహేంద్రవరంలో ఈ నెల 12న అర్ధరాత్రి శ్రీకాకుళం పోలీసులపై ఎటాక్ చేసి దొంగ నోట్ల కేసులో నిందితుడు రాపాక ప్ర భాకర్ అలియాస్ ప్రతాప్ రెడ్డిని తీసుకు పో యారు. ఈ సంఘటన సంచలనంగా మారింది. పోలీసులపై ఎటాక్ చేసి నిందితుడిని ఎత్తు కుపోవడం
పోలీసుల అదుపులో 13 మంది
నిందితులు రాజమహేంద్రవరం, భీమవరం వాసులే
పరారీలో ఐదుగురు
స్విప్ట్ కారు, నాలుగు బైక్‌లు స్వాధీనం
రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): తప్పించుకుందామని పోలీసులపై ఎటాక్ చేస్తే అసలు డొంక కదిలింది.. భీమవరం కేంద్రంగా సాగుతున్న పెద్ద దొంగ నోట్ల ముఠా బయటపడింది. రాజమహేంద్రవరంలో ఈ నెల 12న అర్ధరాత్రి శ్రీకాకుళం పోలీసులపై ఎటాక్ చేసి దొంగ నోట్ల కేసులో నిందితుడు రాపాక ప్ర భాకర్ అలియాస్ ప్రతాప్ రెడ్డిని తీసుకు పో యారు. ఈ సంఘటన సంచలనంగా మారింది. పోలీసులపై ఎటాక్ చేసి నిందితుడిని ఎత్తు కుపోవడంపై ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. మొత్తం 18 మంది పోలీసులపై ఎటాక్ చేసి అదుపులో ఉన్న నిందితుడిని ఎత్తుకుపోయినట్టు గుర్తించారు. అనంతరం తీగలాగితే దొంగనోట్ల ముఠా గుట్టు బయటపడింది. వారిలో 13 మంది ని ప్రకాష్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకు న్నారు. రాజమహేంద్రవరం మహిళా పోలీస్ స్టేషన్‌లో మంగళవారం సాయంత్రం విలేకరుల కు అడిషనల్ ఎస్పీ అల్లూరి వెంకట సుబ్బరాజు, సెంట్రల్ జోన్ డీఎస్పీ కే.రమేష్ బాబు, ప్రకా ష్‌నగర్ సీఐ బాజిలాల్ వివరాలు వెల్లడించారు.
అసలు ఏం జరిగిందంటే...
శ్రీకాకుళం జిల్లా సిగడం పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో నిందితుడిగా ఉన్న రాపాక ప్రభాకర్ అలియాస్ ప్రతాప్ రెడ్డిని ఈనెల 12న రాత్రి పోలీసులు భీమవరంలో అరెస్టు చేశారు. ఇదే కేసులో రెండో నిందితుడిగా ఉన్న కృష్ణమూర్తి కోసం రాజమహేంద్రవరం ప్రకాష్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెల్‌టవర్ లోకేషన్ వెరిఫై చేయడానికి వచ్చారు. శ్రీకాకుళం పోలీసులు ప్రకాష్‌నగర్ పోలీస్ స్టేషన్‌కి వచ్చి తిరిగి ప్రభాకర్‌ను తీసుకుని వెళ్లిపోతుండగా రాజమహేంద్రవరం ఆర్‌టీసీ కాంప్లెక్స్ రోడ్డు వీఎల్‌పురం సర్కిల్ లిమిట్స్‌లో కొంతమంది రెండు కార్లు, నాలుగు బైక్‌లపై వచ్చి పోలీసులపై ఎటాక్ చేసి రాపాక ప్రభాకర్‌ను తీసుకుని వెళ్లిపోయారు. దీనిపై అదే రోజు రాత్రి ప్రకాష్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో సీఐ బాజీలాల్ కేసు నమోదు చేశారు. పోలీస్‌లపై ఎటాక్ చేసిన ముఠా ఆచూకీ కోసం ఆరు బృందాలను రంగంలోకి దింపి విస్తృతంగా గాలిం చారు. ఎటాక్ చేసినవారంతా దొంగనోట్ల ముఠాకు చెందిన వారని గుర్తించి అరెస్టు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం దెయ్యాలతిప్పకు చెందిన నల్లి శశికాంత్, బ్రిడ్జిపేట గునుపూడికి చెందిన పోతుల యాపేతు అలియాస్ వినోద్, గునుపూడి అంబేడ్కర్ నగర్‌కు చెందిన తాళ్ళ జాన్సన్ రాజు, బ్రిడ్జిపేటకు చెందిన పెద్దపాటి మహంకాళి, నేతపూడి క్రాంతి కుమార్, మొగల్తూరు మండలం కవురు వారిపా లెం అంబేడ్కర్ కాలనీకి చెందిన గండుపల్లి కామరాజు, రాజమహేంద్రవరం నెహ్రునగర్‌కు చెందిన గెద్దాడ శ్రీనాథ్, వై.జంక్షన్ సుబ్బారావు పేటకు చెందిన తురుబిల్లి రామసతీష్, తాడితోటకు చెందిన బుంగా తేజ అలియాస్ ఏలియా, గాంధీపురానికి చెందిన ఇడిసిమళ్ళ సతీష్, ఏవీఏ రోడ్డు కు చెందిన బాలుడు, బుచ్చియ్యపేటకు చెందిన పీతల చిరంజీవి, లక్ష్మివారపుపేటకు చెందిన నక్కా వెంకట దుర్గా శ్రీఅఖిల్‌లను అరెస్టు చేశామన్నారు. వారితో పాటు స్విప్ట్ కారు, 4 బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఈ కేసులో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారని చెప్పా రు. చాలాకాలంగా వారంతా ముఠాగా ఏర్పడి దొంగ నోట్టు మారుస్తున్నట్టు సమాచారం. దీనిలో భాగంగా భీమవరంలో ప్రధాన నిందితుడు ప్రభాకర్‌ను అదుపులోకి తీసుకున్న వెంటనే అటు భీమవరం ముఠా.. ఇటు రాజమహేంద్రవరం ముఠా రంగంలోకి దిగి నిందితుడిని తీసుకెళ్లి పోయారు. సెంట్రల్ జోన్ డీఎస్పీ రమేష్ బాబు పర్యవేక్షణలో కేసును ఛేదించిన సీఐ బాజీలాల్, ఎస్‌ఐ శిశప్రసాద్, హెడ్‌కానిస్టేబుళ్లు ఎన్. వెంకట్రావు, సీహెచ్.శ్రీనివాసరావు, క్రైమ్ కానిస్టేబుల్ ఎస్.వీరబాబు, వి.నాగరాజు, టి.వరహాల బాబు, బి.రాజబాబును ఎస్పీ నరసింహకిషోర్ ప్రత్యేకం గా అభినందించారని అడిషనల్ ఎస్పీ తెలిపారు.
ఆరుగురు రాజమహేంద్రవరం వారే...
దొంగ నోట్ల ముఠా కేసులో నిందితుడిని తప్పించేందుకు శ్రీకాకుళం పోలీస్‌లపై ఎటాక్ చేసిన వారిలో ఆరుగురు రాజమహేంద్రవరానికి చెందిన వారే కావడం విస్మయానికి గురిచేస్తుంది. వారంతా 19 నుంచి 32 ఏళ్ల వారే.