గొల్లప్రోలు కమిషనర్‌ను సస్పెండ్ చేయాలి
ABN , Publish Date - Sep 29 , 2024 | 12:23 AM
గొల్లప్రోలు, సెప్టెంబరు 28: పట్టణ పరిధిలో జరిగే ఏ విషయాన్ని తెలియచేయకుండా, ప్రోటోకాల్ పాటించకుండా కమిషనరు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ చైర్‌పర్సన్ సహా వైస్‌చైర్మన్లు, వైసీపీ కౌన్సిలర్లు నగరపంచాయతీ సమావేశాన్ని బహిష్కరించారు. గొల్లప్రోలు నగరపంచాయతీ కౌన్సిల్ సమావేశం శనివారం చైర్‌పర్సన్ గండ్రేటి మంగతాయారు అధ్యక్షతన ప్రారంభమైంది. వెంటనే వైస్‌చైర్మన్లు గంధం నాగేశ్వరరావు, తెడ్ల
నగర పంచాయతీ సమావేశాన్ని బహిష్కరించిన చైర్‌పర్సన్ సహా వైసీపీ కౌన్సిలర్లు
గొల్లప్రోలు, సెప్టెంబరు 28: పట్టణ పరిధిలో జరిగే ఏ విషయాన్ని తెలియచేయకుండా, ప్రోటోకాల్ పాటించకుండా కమిషనరు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ చైర్‌పర్సన్ సహా వైస్‌చైర్మన్లు, వైసీపీ కౌన్సిలర్లు నగరపంచాయతీ సమావేశాన్ని బహిష్కరించారు. గొల్లప్రోలు నగరపంచాయతీ కౌన్సిల్ సమావేశం శనివారం చైర్‌పర్సన్ గండ్రేటి మంగతాయారు అధ్యక్షతన ప్రారంభమైంది. వెంటనే వైస్‌చైర్మన్లు గంధం నాగేశ్వరరావు, తెడ్లపు అలేఖ్యరాణితో పా టు వైసీపీ కౌన్సిలర్లు ఇటీవల 18వ వార్డులో జరిగిన వీధిలైట్లు, కుళాయిల ప్రారంభోత్సవాలపై ప్రస్తావించారు. చైర్‌పర్సన్, కౌన్సిలర్లుకు సమాచారం లేకుండా ఎలా నిర్వహించారని ప్రశ్నించారు. జూలైలో వీధిలైట్లు కొనుగోలుకు టెండర్లు పిలవాలని కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేస్తే నామినేషన్ పద్ధతిపై ఎలా ఇచ్చారని నిలదీశా రు. టెండర్లు ఎవ్వరు వేయకపోవడంతోనే నామినేషన్‌పై ఇచ్చామని తెలిపారు. వీధిలైట్లు ఎవరయినా స్పాన్సర్ చేశారా, నగరపంచాయతీ నిధులతో కొనుగోలు చేశారా అని ప్రశ్నించారు. నగరపంచాయతీ నిధులతోనే కొనుగోలు చేశామని ఏఈ ప్రభాకర్ తెలిపారు. ప్రోటోకాల్ పాటించకపోవడం ఏంటర్ కౌన్సిలర్లు కమిషనరును నిలదీశారు. సమాచార లోపంతో పొరపాటు జరిగింద ని, క్షమించాలని కమిషనరు కోరినా వారు పట్టించుకోలేదు. దీంతో సుమారు గంట పాటు సమావేశం స్తంభించింది. కమిషనరుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైసీపీ కౌన్సిలర్లు చైర్‌పర్సన్‌కు లేఖ ఇచ్చారు. అనంతరం కౌన్సిల్ స మావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు చైర్‌పర్సన్, వైస్‌చైర్మన్లు, వైసీపీ కౌన్సిలర్లు ప్రకటించి వెళ్లిపోయారు. దీంతో సమావేశం అర్థాంతరంగా వాయి దా పడింది. కమిషనరును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నగరపంచాయతీ కార్యాలయం ప్రధాన గేటు వద్ద చైర్‌పర్సన్ సహా కౌన్సిలర్లు ధర్నా నిర్వహించారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.
జనసేన నేతల ఆగ్రహం
వీధిలైట్లు వెలగక పట్టణమంతా అంధకారంలో చిక్కుకుంటే సమస్యను సత్వరం పరిష్కరించిన పంచాయతీ అధికారులను అభినందించకుండా, వారిని తప్పుపడుతూ చర్యలు తీసుకోవాలని నగరపంచాయతీ వైసీపీ ప్రజాప్రతినిధులు డిమాండ్ చేయడంపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గొల్లప్రోలు నగరపంచాయతీ కార్యాలయం వద్ద వారు శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ సమావేశంలో జనసేన నేతలు కడారి తమ్మయ్యనాయుడు, పర్ల రాజా, బలిరెడ్డి గంగబాబు, బస్సా చిట్టిబాబు, మామిడాల దొరబాబు, జీవీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.