ఎడతెరిపి లేని వర్షం
ABN , Publish Date - Sep 01 , 2024 | 12:06 AM
పిఠాపురం, ఆగస్టు 31: ఎడతెరిపి లేని వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు, డ్రెయిన్లు ఏకమయ్యాయి. వర్ష ప్రభావంతో ప్ర భుత్వ, ప్రవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి దాని ప్రభావంతో పిఠాపురం, పరిసర ప్రాంతా ల్లో శనివారం
పిఠాపురం, ఆగస్టు 31: ఎడతెరిపి లేని వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు, డ్రెయిన్లు ఏకమయ్యాయి. వర్ష ప్రభావంతో ప్ర భుత్వ, ప్రవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి దాని ప్రభావంతో పిఠాపురం, పరిసర ప్రాంతా ల్లో శనివారం భారీ వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచి ఉదయం 10.30గంటల వరకూ మధ్యలో వి స్తారంగా వర్షం పడడంతో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. ఎక్కడిక్కడ డ్రెయిన్లు పొంగిపొర్లాయి. రహదారులపై ఉన్న వర్షపునీటిలోనే ప్రజలు రాకపోకలు సాగి ంచారు. మార్కెట్‌కు వెళ్లే మార్గాల్లో నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వ, ప్రవేటు కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, ఆసుపత్రులకు వెళ్లే రోగులు, వారి సహాయకులు వర్షంలో తడుస్తూనే ప్ర యాణాలు సాగించారు. పట్టణంలోని ప్రభుత్వ, ప్రవే టు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. పాఠశాలలకు వచ్చిన విద్యార్థులను వెనక్కి పంపారు. రాత్రి వర కు వర్షం, ఆపై జల్లులు పడుతూనే ఉన్నాయి. దీంతో రహదారులపై జనసంచారం అంతంతమాత్రంగానే ఉంది.
పిఠాపురం రూరల్: మండలంలోని గ్రామాల్లో శనివారం కురిసిన భారీ వర్షాలతో పంటపొలాలు నీట మునిగాయి. జములపల్లి తదితర గ్రామాల్లో సుమారు వంద ఎకరాల్లోని వరి పంట ముంపునకు గురయింది. గ్రామాల్లోని రహదారులు జలమయమయ్యాయి.
గొల్లప్రోలు: గొల్లప్రోలులో శుక్రవారం తెల్లవారుజాము నుంచి విరామం ఇవ్వకుండా కురుస్తున్న వర్షం శనివారం ఉదయం తీవ్రమైంది. కుంభవృష్టి మాదిరిగా 2 గంటలు పాటు కురిసిన వర్షంతో ప్రధాన ఆర్‌అం డ్‌బీ రహదారితో పాటు ప్రధాన వీధులన్ని జలమయమయ్యాయి. పలుచోట్ల డ్రెయిన్లు పొంగిపొర్లి రోడ్డుపై నీరు ప్రవహించింది. కొన్ని ప్రాంతాల్లో రెండు అడుగుల ఎత్తున వర్షపునీరు ప్రవహించింది. కాలనీల్లో పలుచోట్ల నీరు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వర్షం రాత్రి వరకూ పడుతూనే ఉంది. గొల్లప్రోలు పట్టణంలోని సుద్దగడ్డకు చేర్చి ఉన్న పంటకాలువకు శనివారం సాయంత్రం గండి పడింది. దీంతో సమీపంలోని పంటపొలాల్లోకి వరద నీరు చేరుతున్నది. ఈ కాలువకు పడిన గండి కారణంగా జగనన్న కాలనీ వాసులు ప్రత్యామ్నాయ రహదారిగా వినియోగిస్తున్న మార్గం కూడా మూసుకుపోయింది.
గొల్లప్రోలు రూరల్: గొల్లప్రోలు మండలం వన్నెపూడిలోని ప్రధాన ఆర్‌అండ్‌బీ రహదారిపైకి భారీగా వర్షపునీరు చేరింది. వన్నెపూడి నుంచి ఎన్‌హెచ్-216కి వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డుపై సుమారు అర కిలోమీటరు పొడవునా 3 అడుగుల ఎత్తున వర్షపునీరు ప్రవహిస్తున్నది. వర్షపునీటిలోనే ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు.