Share News

ఏసుక్రీస్తు ప్రేమ, దయ, శాంత గుణాలకు మార్గదర్శకుడు : కలెక్టర్‌

ABN , Publish Date - Dec 24 , 2024 | 12:48 AM

కార్పొరేషన్‌(కాకినాడ),డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): ఏసుక్రీస్తు చూపిన ప్రేమ, అనురాగాలు, ప్రజల మనుగడ, జీవనశైలిని మార్చాయని, ప్రజల కోసం ఆయన ప్రాణత్యాగం చేయడంతో ప్రపంచ దేశాలన్నీ ఆయనను అనుకరిస్తున్నాయని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ప్రేమ, దయ, శాంత గుణాలు అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్‌ షాన్‌మోహన్‌ అన్నారు. సోమవారం మైనార్టీ సంక్షేమ శాఖ, ఏపీ స్టేట్‌ క్రిస్టియన్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో కాకినాడ స్మార్ట్‌ సిటీ

ఏసుక్రీస్తు ప్రేమ, దయ, శాంత గుణాలకు మార్గదర్శకుడు : కలెక్టర్‌
కార్యక్రమంలో కేక్‌ కట్‌ చేస్తున్న జిల్లా కలెక్టర్‌, ఎమ్మెల్యే కొండబాబు తదితరులు

కార్పొరేషన్‌(కాకినాడ),డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): ఏసుక్రీస్తు చూపిన ప్రేమ, అనురాగాలు, ప్రజల మనుగడ, జీవనశైలిని మార్చాయని, ప్రజల కోసం ఆయన ప్రాణత్యాగం చేయడంతో ప్రపంచ దేశాలన్నీ ఆయనను అనుకరిస్తున్నాయని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ప్రేమ, దయ, శాంత గుణాలు అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్‌ షాన్‌మోహన్‌ అన్నారు. సోమవారం మైనార్టీ సంక్షేమ శాఖ, ఏపీ స్టేట్‌ క్రిస్టియన్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో కాకినాడ స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన క్రిస్మస్‌ హైటీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్‌ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. జిల్లాలోని ప్రజలంతా సుఖసంతోషాలతో అభివృద్ధి చెందాలని కలెక్టర్‌ ఆకాం క్షించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రిస్టియన్లకు అందించే అన్ని కార్యక్రమాలను మరింత చేరువ చేసేందుకు ముందుంటుందని ఆయన చెప్పారు. వారికి ఎటువంటి సమస్య ఉన్నా పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ క్రీస్తు జన్మదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో, రాష్ట్రంలో అందరూ బాగుండాలని ఆయన ఆకాం క్షించారు. కూటమి ప్రభుత్వం అందరికీ అవసరమైన పనులు చేయడం జరుగుతోందన్నారు. సరైన ప్రభుత్వం, పాలకులు ఉన్న ప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. జనసేన పిఠాపురం ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఏసు చూపిన మార్గం, విలువలు జీవితానికి మార్గదర్శకాలు అన్నారు. తనను తాను తగ్గించుకున్నట్టయితే హెచ్చించబడతాడని చాలాసార్లు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ గుర్తుచేశారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి సునీల్‌కుమార్‌, రెవ. పాస్టర్‌ దేవిశెట్టి చార్లెస్‌, రెవ. బలగం శ్యామ్‌కుమార్‌, రెవ.జోసఫ్‌బెన్నీ, రెవ.సామ్యూల్‌సాగర్‌, రెవ.డాక్టర్‌ పీఎన్‌ హెన్నీ, బిషప్‌ పి.ఇశాక్‌, వై.పాపారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2024 | 12:48 AM