Share News

Pawan Kalyan: పవన్‌ భూమ్‌

ABN , Publish Date - Jul 05 , 2024 | 02:46 AM

ఆ ప్రాంతం ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చింది. అక్కడ ఉన్న భూములు కొనుగోలు చేసేందుకు జోరుగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. భూ ముల ధరలకు రెక్కలు వచ్చాయి. నిన్న,మొన్నటివరకూ ఎవరైనా వచ్చి కొనుగోలు చేస్తే చాలు అనుకున్న వారే రాత్రికి రాత్రి మనస్సు మార్చేసుకున్నారు. మేము చెప్పిన ధర ఇస్తేనే అమ్ము తామంటున్నా రు. ఇదంతా పవన్‌కల్యాణ్‌ తన సొంతిల్లు, కార్యాలయం నిర్మాణం కో సం భూములు కొన్న ఫలితం. ఒక్కసారి రియల్‌ జోరు ప్రారంభ మైంది. ఒక స్థలమైనా కొనే ప్రయత్నాల్లో జనసైనికులు ఉన్నారు.

Pawan Kalyan: పవన్‌ భూమ్‌
పిఠాపురం పట్టణ శివారులో పవన్‌కల్యాణ్‌ కొన్న భూములు

  • ఒక్కసారిగా భూముల ధరలకు రెక్కలు

  • ఇంటి నిర్మాణానికి 3.52 ఎకరాలు కొనుగోలు చేసిన డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్‌కల్యాణ్‌

  • మరో 16 ఎకరాలు కొనేందుకు సన్నాహాలు

  • సమీప ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసేందుకు జోరుగా ప్రయత్నాలు

  • అక్కడ ఉన్న లేఅవుట్లలో స్థలాలకు అడ్వాన్సులు

ఆ ప్రాంతం ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చింది. అక్కడ ఉన్న భూములు కొనుగోలు చేసేందుకు జోరుగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. భూ ముల ధరలకు రెక్కలు వచ్చాయి. నిన్న,మొన్నటివరకూ ఎవరైనా వచ్చి కొనుగోలు చేస్తే చాలు అనుకున్న వారే రాత్రికి రాత్రి మనస్సు మార్చేసుకున్నారు. మేము చెప్పిన ధర ఇస్తేనే అమ్ము తామంటున్నా రు. ఇదంతా పవన్‌కల్యాణ్‌ తన సొంతిల్లు, కార్యాలయం నిర్మాణం కో సం భూములు కొన్న ఫలితం. ఒక్కసారి రియల్‌ జోరు ప్రారంభ మైంది. ఒక స్థలమైనా కొనే ప్రయత్నాల్లో జనసైనికులు ఉన్నారు.

పిఠాపురం, జూలై 4: పిఠాపురం నియోజకవర్గంలోని ఏదొక ప్రాం తంలో స్థలం కొని ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉంటా అని ఎన్నికల ముం దు చెప్పిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తన సొంత ఇల్లు, కార్యాలయం నిర్మాణంకోసం పిఠాపురం పట్టణ శివారు ఇల్లింద్రాడ సమీపం లో గొల్లప్రోలు వైపు వెళ్లే 216వ జాతీయ రహదారిలో పుంతరోడ్డును చేర్చి 3.52 ఎకరాలను కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను బుధవారమే పూర్తి చేసి ఆ విషయాన్నే పిఠాపురం లో జరిగిన వారాహి సభలో ప్రకటించా రు. అక్కడే ఇల్లు కట్టుకుంటానని, రెండెకరాల్లో కార్యాలయం నిర్మాణం చేపడతామని ప్రకటించారు. అంతే ఈ సమాచారం పిఠాపురం నియోజకవర్గంతోపాటు ఉభయగోదావరి జిల్లాలు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వైరల్‌గా మారింది. పవన్‌ పిఠాపురంలోనే ఇల్లు కట్టుకుంటున్నారనే సమాచారం సోషల్‌ మీడియాలోనూ ట్రెండింగ్‌గా మారింది.

Pawan-Kalyan.jpg

మరో 16 ఎకరాలకు..

3.52ఎకరాల్లో ఇల్లు, కార్యాలయం నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్న జనసేనానికి ఇక్కడే మరో 16ఎకరాల వరకూ భూమిని కొనుగోలు చేయనున్నారనే సమాచారం ఆసక్తికరంగా మారింది. ఇప్ప టికే ఈ విషయంపై రైతులతో మాట్లాడి మౌఖిక ఒప్పందాలు జరిగినట్లు సమాచారం. పవన్‌కల్యాణ్‌ సొంతంగా ఈ భూములు కొంటున్నారా లేక కుటుంబసభ్యులు, స్నేహితులా అనేది ఇంకా బయటకు రాలేదు. పవన్‌ ఎన్నికల ప్రచార సమయంలో దేశ, విదేశాల్లో స్థిరపడిన తన సన్నిహితులు, అభిమానులు ఇక్కడ సాఫ్ట్‌వేర్‌ లేదా పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి కల్పిస్తానని ప్రకటించారు. అప్పట్లో సాఫ్ట్‌వేర్‌ రంగంలో పలువురు ఎన్‌ఆర్‌ఐలు ఇక్కడ ప్రచారం కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీల ఏర్పాటుకు ఇక్కడ ఏమైనా భూములు తీసుకుంటున్నారా అనే చర్చ జోరుగా సాగుతోంది.

భూములు కొనేందుకు..

పవన్‌ భూములు కొన్న ప్రాంతంలోనే పొలాలు కొనేందుకు పలువు రు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. జనసేనలో క్రియాశీలకంగా ఉన్న నేతలతో పాటు పవన్‌ అభిమానులు, జనసైనికులు కనీసం అరెకరం నుంచి ఐదెకరాల వరకూ కొనుగోలు చేయాలని భావిస్తూ మధ్యవర్తులను సం ప్రదిస్తున్నారు. పిఠాపురం, గొల్లప్రోలు పట్టణాలకు చెందిన పలువురు మధ్యవర్తులు, రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్లు భూముల వేటలో బిజీగా ఉ న్నారు. ఈ ప్రాంతం తరచూ ఏలేరు వరదల కారణంగా ముంపునకు గురవుతోంది. ఇక్కడ భూములు కొనేందుకు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపరు. పవన్‌ భూములు కొన్న తర్వాత పరిస్థితి మారిపోయింది. ముంపు సమస్యకు పవన్‌ పరిష్కారం చూపుతారని పలువురు భావిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా బుధవారం రాత్రి, గురువారం కలిపి 15మంది తనను అక్కడ భూములు కొనేందుకు కావాలని అడిగారని క్రయ,విక్రయాల్లో మధ్యవర్తిగా ఉండే ఒకవ్యక్తి ఆంధ్రజ్యోతికి తెలిపారు.

Pithapuram-Lands.jpg

ధరలు పైపైకి..

పవన్‌ భూములు కొన్న విషయం పైకి పొక్కడంతో ఆ ప్రాంతంలో భూముల ధరలు పెరిగిపోయాయి. రోడ్డు పక్కనే ఉన్న భూమి రూ.2కోట్ల వరకూ ఉంది. లోపల ఉన్న భూములు రూ.50లక్షల నుంచి రూ.కోటి వరకూ ఉన్నాయి. ఇప్పటివరకూ ఆ ధరలు కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. 216వ జాతీయ రహదారిని చేర్చి ఉన్న భూముల కొందామని అనుకున్న వారికి ఎకరం రూ.3కోట్లు చెబుతుండగా లోపల భూముల ధరలు రూ.80లక్షలు నుంచి రూ.1.80కోట్లు వరకూ చెబుతున్నారు. ఇక్కడ సమీపంలో వేసిన లేఅవుట్లలో ఇళ్లస్థలాలకు విపరీతమైన డిమాండ్‌ పెరిగిపోయింది. పవన్‌ భూములు కొన్న ప్రాంతానికి ఎదురుగా ఉన్న లేఅవుట్‌లో స్థలాల కోసం పదిమంది అడ్వాన్సులు చెల్లించేందుకు ముందుకు వచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గజం రూ.6వేల నుంచి రూ.8వేలకు అయినా విక్రయిద్దామని భావించిన సదరు వెంచర్‌ యజమానికి ఇప్పుడు ధరలను దాదాపు రెట్టింపు చేశారు. ఇక్కడకు సమీపంలోని లేఅవుట్లలో ధరలు గురువారం నాటికి పెరిగిపోయాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ధరలు మరింతగా పెరిగే అవకాశముందని భావిస్తున్నారు.

PAwan-01.jpg

పవన్‌ భూములు కొనడంతో పిఠాపురం పట్టణ శివారు ప్రాంతాల్లో ఒక్కసారిగా రియల్‌ ఎస్టేట్‌ యాక్టివిటీ గణనీయంగా పెరిగింది. భూ ములు, స్థలాల కోసం ఎక్కువమంది ఒకేసారి అడుగుతుండడంతో వా టి యజమానులు ఆనందంలో ఉన్నారు. అడ్వాన్సులు ఇస్తామన్నా తీసుకోకుండా గతంలో చెప్పిన దానికంటే అధిక ధరలు చెబుతున్నట్లు సమాచారం. మధ్యవర్తులు కూడా ధర ఇంతే అని చెప్పలేకపోతున్నా రు. యజమానికి వద్దకు తీసుకువెళ్తామని నేరుగా మాట్లాడుకోవాలని వారు సూచిస్తున్నారు. పవన్‌ ఇల్లు, కార్యాలయం నిర్మాణం పూర్తయితే రియల్‌ ఎస్టేట్‌ యాక్టివిటీ మరింత పెరుగుతుందని చెబుతున్నారు.

PAwan.jpg

ఆ భూములు ఎక్కడ..?

పవన్‌ పిఠాపురం సమీపంలో భూములు కొనుగోలు చేశారనే సమాచారం బయటకు రావడంతో గురువారం ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పలువురు అవి ఎక్కడ ఉన్నాయో ఆరా తీసేందుకు పిఠాపురం వచ్చారు. పవన్‌ భూములు ఎక్కడ కొన్నారు, ఇంకా ఎంత భూములు అందుబాటులో ఉన్నాయి తదితర అంశాలు తెలుసుకునేందుకు వారు ఆసక్తి ప్రదర్శించారు. పవన్‌ భూములు కొన్న ప్రాంతాన్ని చూసేందుకు వచ్చేవారితో 216వ జాతీయ రహదారి సందడిగా మారింది.

Updated Date - Jul 05 , 2024 | 09:00 AM