Share News

గురుకులాన్ని తనిఖీ చేసిన జూనియల్‌ సివిల్‌ జడ్జి

ABN , Publish Date - Sep 07 , 2024 | 12:23 AM

ఏలేశ్వరం, సెప్టెంబరు 6: ఏలేశ్వరంలో డాక్టర్‌ బీఆర్‌. అంబేడ్కర్‌ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలను శుక్ర వారం ప్రత్తిపాడు కోర్టు ఇంచార్జ్‌, జూనియర్‌ సివిల్‌ జడ్జి బుల్లెమ్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల సుమారు 89 మంది బాలికలు కలుషిత ఆహారం తిని అనారోగ్యం పాలవ్వడంతో గురుకుల విద్యా

గురుకులాన్ని తనిఖీ చేసిన జూనియల్‌ సివిల్‌ జడ్జి

ఏలేశ్వరం, సెప్టెంబరు 6: ఏలేశ్వరంలో డాక్టర్‌ బీఆర్‌. అంబేడ్కర్‌ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలను శుక్ర వారం ప్రత్తిపాడు కోర్టు ఇంచార్జ్‌, జూనియర్‌ సివిల్‌ జడ్జి బుల్లెమ్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల సుమారు 89 మంది బాలికలు కలుషిత ఆహారం తిని అనారోగ్యం పాలవ్వడంతో గురుకుల విద్యార్థినులకు సెలవులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు జడ్జి బుల్లెమ్మ పా ఠశాల, కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు పట్టీ, వసతి గృహం, వంటశాల స్టాక్‌ రిజిష్టర్‌లు పరిశీలించారు. 605మంది విద్యార్థినులకు 16మంది బాలికలు ఉండగా వారి ఆరోగ్యం పరిస్థితి, విద్యపై ఆరా తీశారు. వసతి గృహం, హాస్ట ల్‌లో తాగు నీరు, పలు సదుపాయాలు సమకూర్చాలని ప్రి న్సిపాల్‌ చంద్ర శారదకు ఆదేశాలు జారీ చేశారు. అల్పాహా రం, భోజనం మెనూప్రకారం అందజేయాలన్నారు. ఎప్పటి కప్పుడు క్లాసు రూములు, వసతిగృహం, వంటశాలను పరి శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Updated Date - Sep 07 , 2024 | 12:23 AM