బురద రాజకీయాలకు జగన్‌రెడ్డి పెట్టింది పేరు
ABN , Publish Date - Sep 14 , 2024 | 12:39 AM
కాకినాడ సిటీ, సెప్టెంబరు 13: బురద రాజకీయాలకు మాజీ సీఎం జగన్‌రెడ్డి పెట్టింది పేరని, రాష్ట్రంలో వరద బాధితులకు సహాయం చేయాల్సిందిపోయి రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నాడని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగ
కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు
కాకినాడ సిటీ, సెప్టెంబరు 13: బురద రాజకీయాలకు మాజీ సీఎం జగన్‌రెడ్డి పెట్టింది పేరని, రాష్ట్రంలో వరద బాధితులకు సహాయం చేయాల్సిందిపోయి రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నాడని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌రెడ్డి పిఠాపురంలో వరద బాధితులను పరా మర్శించడానికి రాలేదని, బురద రాజకీయాలు చేయడానికి వచ్చాడన్నారు. గత 12 రోజులుగా వరద బాధితులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం నిలబడిందని, జైల్లో ఉన్న క్రిమినల్స్‌ను పరా మర్శించడానికి ఉన్న సమయం వరద బాఽధి తులను పరామర్వించడానికి లేదన్నారు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు జగన్‌రెడ్డికి లేద ని, వైసీపీ ప్రభుత్వ హయంలో వరదలు వచ్చినప్పుడు తాడేపల్లి కొంపను వదిలి బయ టకు రాలేదన్నారు. ప్రకృతి వనరులను దోచు కోవడమే పనిగా పెట్టుకుని రాష్ట్ర అభివృద్ధిని, జల వనరుల శాఖను నిర్లక్ష్యం చేయడం వల్లే నేడు వరద ప్రభావం ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై పడిందని ఎమ్మెల్యే కొండబాబు విమర్శించారు.
వరద బాధితులకు సాయం
వరద బాధితుల సహాయార్థం జె కామ్ ఎల్ కాకినాడ 1.0 గ్రూపు రూ.66వేల చెక్కును కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు ఆయన స్వగృహం వద్ద అందజేశారు. గ్రూపు సభ్యులు పి.శ్రీనివాస్, విహారి, సతీ్‌ష్, కపిల్, ఆ దిత్య, హర్షిత, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.