Share News

ఇంటింటా పింఛన్లు పంపిణీ

ABN , Publish Date - Sep 01 , 2024 | 12:08 AM

కాకినాడ సిటీ, ఆగస్టు 31: ఒక రోజు ముందుగానే పింఛన్ల పంపిణీతో అవ్వతాతల ముఖాల్లో ఆనందం వెల్ల్లివిరిసిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. శనివారం చేపట్టిన ఎన్టీఆర్‌ సామాజిక పింఛన్ల పంపిణీలో భాగంగా జోరు వానలో 39వడివిజన్‌ రామారావుపేట చీడీలపోర ప్రాంతం

ఇంటింటా పింఛన్లు పంపిణీ
కాకినాడలో దివ్యాంగురాలకు పింఛను అందజేస్తున్న ఎమ్మెల్యే

కాకినాడ సిటీ, ఆగస్టు 31: ఒక రోజు ముందుగానే పింఛన్ల పంపిణీతో అవ్వతాతల ముఖాల్లో ఆనందం వెల్ల్లివిరిసిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. శనివారం చేపట్టిన ఎన్టీఆర్‌ సామాజిక పింఛన్ల పంపిణీలో భాగంగా జోరు వానలో 39వడివిజన్‌ రామారావుపేట చీడీలపోర ప్రాంతంలో మంచానికే పరిమితమైన ఓ మానసిక దివ్యాంగురాలికి దివ్య ఇంటికి ఎమ్మెల్యే స్వయంగా సచివాలయ సిబ్బం దితో కలిసి వెళ్లి పెన్షన్‌ అందజేశారు. చీడీలపోర చుట్టుపక్కల ఉన్న వృద్ధులకు ఎమ్మెల్యే పెన్షన్‌ అంద జేశారు. కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు మ ల్లిపూడి వీరు పాల్గొన్నారు. 28వ డివిజన్‌లో మాజీ మేయర్‌ సుంకర పావని పెన్షన్‌దారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. డివిజన్‌లో గల కిడ్నీ డయాలసిస్‌ బాధితురాలు గ్రంథి లక్ష్మీకుమారి ఇంటికి స్వయంగా వెళ్లి రూ.10వేలు పెన్షన్‌ అందజేశారు. హార్ట్‌ ఎటాక్‌తో చికిత్స పొందుతున్న పెన్షన్‌దారుడు తాతపూడి భీమరా జుకు 24వ డివిజన్‌ ఇన్‌చార్జి పాలిక నాని, సచివాలయ సిబ్బంది ప్రభుత్వాస్పత్రికి వెళ్లి పెన్షన్‌ పంపిణీ చేశారు. అనారోగ్యంతో ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న పెన్షన్‌దారురాలు మారుపిల్లి సీతకు 10వ డివిజన్‌ ఇన్‌చార్జి ఎరిపిల్లి అబ్బాయి, సచివాలయ సిబ్బంది ఆస్పత్రికి వెళ్లి పెన్షన్‌ అందజేశారు. 11వ డివిజన్‌లో టీడీపీ నేత కడలి వెంకటరమణ పెన్షన్‌ అందజేశారు.

Updated Date - Sep 01 , 2024 | 12:08 AM