Share News

నగర వనాల ఏర్పాటుకు ప్రాధాన్యం

ABN , Publish Date - Nov 03 , 2024 | 12:40 AM

గొల్లప్రోలు రూరల్‌, నవంబరు 2(ఆంధ్ర జ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో నగర వనాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు కలెక్టర్‌ సగిలి షాన్‌ మోహన్‌ తెలిపారు. గొల్లప్రో

నగర వనాల ఏర్పాటుకు ప్రాధాన్యం
చేబ్రోలులో నగర వనం ఏర్పాటుపై పరిశీలన చేస్తున్న కలెక్టర్‌ షాన్‌ మోహన్‌

కలెక్టర్‌ సగిలి షాన్‌ మోహన్‌

గొల్లప్రోలు రూరల్‌, నవంబరు 2(ఆంధ్ర జ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో నగర వనాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు కలెక్టర్‌ సగిలి షాన్‌ మోహన్‌ తెలిపారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో నగర వనం ఏర్పాటుకు ప్రతిపాదించిన కంకరగని భూములను ఆయన శనివారం పరిశీలించారు. అక్కడి పరిస్థితులపై ఆరా తీశా రు. కలెక్టర్‌ వెంట కాకినాడ ఆర్డీవో మల్లిబాబు, తహశీల్దారు సత్యనారాయణ, సర్వేయర్‌ కేదారేశ్వరరావు, అటవీశాఖ అధికారులున్నారు. కాగా గొల్లప్రోలు పాత్‌హోల్స్‌ పూడ్చేందుకు అవసరమైన నిధులు 6.30లక్షలు నగరపంచాయతీ వద్ద అందుబాటులో లేని నేపథ్యంలో ఆ నిధులను తాను మంజూరు చేస్తానని కలెక్టర్‌ తెలిపారు.

మధ్యాహ్న బోజన పథక ఏజెన్సీ మార్పు

పిఠాపురం నియోజకవర్గంతో పాటు జిల్లాలోని పలు మండలాల్లోని పాఠశాలలుకు మధ్యా హ్న భోజన పథకానికి సంబంధించి ఆహార పదార్థాలు పంపుతున్న ఇంప్లిమెంటింగ్‌ ఏజెన్సీని మార్పు చేయనున్నట్లు కలెక్టర్‌ వెల్లడించారు. ఈ ఏజెన్సీ పంపుతున్న ఆహార పదార్థాల నాణ్యత సరిగా ఉండడంలేదని అధికంగా ఫిర్యాదులు వ స్తున్నాయని ఈనేపథ్యంలో మధ్యాహ్న భోజనం పథకం ద్వారా ఆహార పదార్థాలు వండే బాధ్యతను ఇస్కాన్‌కు అప్పగించాలా లేదా పాఠశాలల వారీగా ఇంప్లిమెంటింగ్‌ ఏజెన్సీ ఏర్పాటు చేయా లా అనే అంశంపై పరిశీలన చేస్తున్నామన్నారు.

Updated Date - Nov 03 , 2024 | 12:40 AM