అర్జీలను సకాలంలో పరిష్కరించాలి : కమిషనర్
ABN , Publish Date - Oct 08 , 2024 | 12:55 AM
కార్పొరేషన్ (కాకినాడ), అక్టోబరు 7: డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదు ల పరిష్కార వ్యవస్థకు వచ్చే సమస్యల అర్జీలను సకాలంలో పరిష్కరించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉదయం 9.30 నుంచి 10.30 గం
కార్పొరేషన్ (కాకినాడ), అక్టోబరు 7: డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదు ల పరిష్కార వ్యవస్థకు వచ్చే సమస్యల అర్జీలను సకాలంలో పరిష్కరించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్‌కు 9మంది ఫోన్ చేసి సమస్యలను వివరించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో కమిషనర్‌కు సుమారు 35 వరకు అర్జీలు అందాయి. కార్యక్రమంలో అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, డిప్యూటీ కమిషనర్ మనోహర్, ఎంహెచ్‌వో డాక్టర్ పృద్వీచరణ్, మేనేజర్ శిరీష్ తదితరులున్నారు.