Share News

దేశాభివృద్ధిలో చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు కీలకపాత్ర : ఎంపీ

ABN , Publish Date - Sep 02 , 2024 | 12:18 AM

సర్పవరం జంక్షన్‌, సెప్టెంబరు 1: దేశాభివృద్ధిలో చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. భారతదేశ ఎగుమతులు 45 శాతం వాటాతో సుమారు 15 కోట్ల మం

దేశాభివృద్ధిలో చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు కీలకపాత్ర : ఎంపీ
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ

సర్పవరం జంక్షన్‌, సెప్టెంబరు 1: దేశాభివృద్ధిలో చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. భారతదేశ ఎగుమతులు 45 శాతం వాటాతో సుమారు 15 కోట్ల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఐదేళ్లలో సుమారు 3 వేల మంది యువ పారిశ్రామిక వేత్తలను తయారు చేసేలా రుణాలిచ్చేందుకు ముందుకువచ్చిందని యువత సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. ఆదివారం కాకినాడ రూరల్‌ రమణయ్యపేట ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లో శ్రీసత్యదేవ ప్రింటింగ్‌ క్లస్టర్‌ అసోసియేషన్‌లో స్మాల్‌ ఇండస్ట్రీస్‌ డవలెప్‌మెంట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (సిడ్బీ) వెస్టరన్‌ జోన్‌ సీజీఎం సంజయ్‌ గుప్తా ఆధ్వర్యంలో మైక్రో స్మాల్‌ మీడియా ఎంటర్‌ప్రైజెస్‌ (ఎంఎస్‌ఎంఈ) క్లస్టర్‌ అవుట్‌ రీచ్‌ ప్రోగ్రా మ్‌పై నిర్వహించిన అవగాహనలో ఎంపీ ముఖ్య అతిథిగా ప్రసంగించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌, తాను కలసి కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌తో మాట్లాడి సిడ్బీ బ్యాంకు కాకినాడకు మంజూరు అయ్యేలా కృషి చేశామన్నారు. శ్రీసత్యదేవ క్లస్టర్‌ ఎండీ కోరుమిల్లి బాలా ప్రసాద్‌, క్లస్టర్‌ సెక్రటరీ జీవీఆర్‌మూర్తి, జాయింట్‌ ఎండీ ఎన్‌.రాజేష్‌, ఫణి పూర్ణచంద్రరావు, సిడ్బీ జనరల్‌ మేనేజర్‌ వి.చంద్రమౌళి, డీజీఎం టివిద్యాసాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 02 , 2024 | 12:18 AM