వైసీపీ నాయకులను శిక్షించాలి
ABN , Publish Date - Sep 29 , 2024 | 12:25 AM
గండేపల్లి, సెప్టెంబరు 28: హిందువులు ఎంతో పవిత్రంగా తిరుమల శ్రీవారి లడ్డూను అపవిత్రం చేసిన వైసీపీ నాయకులను వెంటనే శిక్షించాలని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్ అన్నారు. శనివారం తాళ్ళూరు గ్రామం వేంకటేశ్వరస్వామి ఆలయంలో జనసేన ఇన్‌చార్జి తుమ్మలపల్లి రమేష్ చేపట్టిన ప్రాయశ్చిత దీ
గండేపల్లి, సెప్టెంబరు 28: హిందువులు ఎంతో పవిత్రంగా తిరుమల శ్రీవారి లడ్డూను అపవిత్రం చేసిన వైసీపీ నాయకులను వెంటనే శిక్షించాలని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్ అన్నారు. శనివారం తాళ్ళూరు గ్రామం వేంకటేశ్వరస్వామి ఆలయంలో జనసేన ఇన్‌చార్జి తుమ్మలపల్లి రమేష్ చేపట్టిన ప్రాయశ్చిత దీక్షకు ఎంపీ సంఘీభావం తెలిపి నిమ్మరసమిచ్చి దీక్ష విరమింపచేశారు. ఆలయాన్ని శుభ్రపరిచి సంప్రోక్షణ చేపట్టారు. కార్యక్రమంలో బీజేపీ ఇన్‌చార్జి వర్మ, సర్పంచ్ శీలామంతుల వీరబాబు, ఉపసర్పంచ్ పైణ్ణి వెంకటేశ్వరవు, మేడిబోయిన శ్రీను, సూరంపాలెం బాలు, పితాని వీరబాబు, అయిరాజు, రామకృష్ణ, రామ్‌దీపు, దొడ్డ శ్రీను, గంగాధర్ పాల్గొన్నారు.
పిఠాపురం: లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిని వినియోగించడం ద్వారా వైసీపీ నేతలు తిరుమలను అపవిత్రం చేశారని ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయకుమార్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ విమర్శించారు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా పట్టణంలో ఉప్పాడ సెంటర్‌లో చేపట్టిన దీక్షలు శనివారం కొనసాగాయి. వారి దీక్షలకు అజయకుమార్, తంగెళ్లలు, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు, జనసేన నాయకులు మద్దతు తెలిపారు.