దోపిడికి...ద్వారం!
ABN , Publish Date - Dec 14 , 2024 | 01:42 AM
కాకినాడ అంటే పెన్షనర్స్ ప్యారడైజ్. ఎన్నో దశాబ్దాల నుంచి ఈ నగరానికి ఆ పేరు ఉంది. కానీ ఇప్పుడు వరుస కుంభకోణాలతో కాకినాడ కాకెక్కిపోతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిలు వునా దోచేసి కాకినాడను కుంభకోణాల నగరంగా మార్చేశారు. దీనికి నిలువెత్తు నిదర్శనమే కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు వేల కోట్ల రూపాయల రేషన్ బియ్యం అక్రమ రవాణా.. సీపోర్టులో బెదిరించి కేవీరావు నుంచి వాటాలను బలవంతంగా లాగేసుకున్న
కాకినాడలో కుంభకోణాలు
నాడు వైసీపీలో అక్రమార్కులు..
రేషన్ బియ్యం స్మగ్లింగ్
సీపోర్టులో వాటాల వశం
రెండు అక్రమాలపై సిట్, సీఐడీ
ప్రభుత్వం మారి..వెలుగులోకి దందా
త్వరలో గుట్టువిప్పనున్న సిట్, సీఐడీ
ఇప్పటికే సీ పోర్టులో దర్యాప్తు
తాజాగా కలెక్టర్ల సదస్సులో చర్చ
(కాకినాడ, ఆంధ్రజ్యోతి)
కాకినాడ అంటే పెన్షనర్స్ ప్యారడైజ్. ఎన్నో దశాబ్దాల నుంచి ఈ నగరానికి ఆ పేరు ఉంది. కానీ ఇప్పుడు వరుస కుంభకోణాలతో కాకినాడ కాకెక్కిపోతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిలు వునా దోచేసి కాకినాడను కుంభకోణాల నగరంగా మార్చేశారు. దీనికి నిలువెత్తు నిదర్శనమే కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు వేల కోట్ల రూపాయల రేషన్ బియ్యం అక్రమ రవాణా.. సీపోర్టులో బెదిరించి కేవీరావు నుంచి వాటాలను బలవంతంగా లాగేసుకున్న వ్యవహా రం. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్..సీపోర్టు ప్రధాన వాటాదారుడు కేవీరావు నుంచి వాటాలను కొట్టేసిన వైనంపై సీఐడీని ప్రభుత్వం నియమించింది. కాకినాడతో ముడిపడి ఉన్న ఈ రెండు ఘటనలు ఇప్పు డు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా కలెక్టర్ల సదస్సులోను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఈ అంశాలపై చర్చించారు.
వేల కోట్లు మింగేశారు..
కాకినాడ కేంద్రంగా రేషన్ బియ్యం విదేశాలకు కొన్నే ళ్లుగా యథేచ్ఛగా తరలిపోతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమార్కులు మరింత బరితెగించారు. సీఎం జగన్‌కు సన్నిహితుడైన అప్పటి ఎమ్మెల్యే ద్వారం పూడి తన సోదరుడు, అనుచరుల ద్వారా వేల కోట్ల రూపాయల విలువైన బియ్యాన్ని రేషన్ బియ్యంతో కలిపి విదేశాలకు ఎగుమతి చేసేవారు. గడచిన ఐదేళ్లు కాకినాడలోని యాంకరేజ్, డీప్‌వాటర్ పోర్టుల నుంచి ఎమ్మెల్యే ద్వారంపూడి కుటుంబం, ఆయన అనుచరులు లక్షల టన్నుల రేషన్ బియ్యాన్ని ఓడల్లో తరలించేశారు. రేషన్ బియ్యంతో పాటు పేదలకు రాష్ట్రప్రభుత్వం పౌష్టి కాహారం కింద పంపిణీ చేసిన పోర్టిఫైడ్ బియ్యాన్ని సైతం పాలిష్ చేసి విదేశాలకు ఎగుమతి చేసేసింది. అక్రమార్కులకు బియ్యం వ్యాపారం రూ.లక్ష పెట్టుబడికి రూ.10లక్షల రాబడి సమకూరింది. వైసీపీ అధికారంలోకి రాకముందు కాకినాడ యాంక రేజ్ పోర్టు నుంచి మాత్రమే విదేశాలకు బియ్యం ఎగు మతి జరిగేది. ఆ సమయంలో 2018-2019లో ఏడాదికి పోర్టు ద్వారా 16 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగు మతి అయ్యేవి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఎగుమతులు రెట్టింపయ్యాయి. అదే సమ యంలో రేషన్ మాఫియా కోరలు చాచింది.అప్పటి సీఎం జగన్‌కు సన్నిహితుడైన కాకినాడ కీలకనేత ద్వారంపూడి తన మాఫియాను రెట్టింపు చేశాడు. దీంతో కాకినాడకు నిత్యం వేల లారీల్లో రేషన్ బియ్యం రహస్యంగా గోదాముల్లో చేరేది. అప్పటి పౌరసరఫరాల సంస్థ సైతం అక్రమార్కులకు సహకరించింది. ఈ విభాగం ద్వారం పూడి తండ్రి చేతుల్లో ఉండేది.అటు రాష్ట్ర మిల్లర్ల సం ఘం కూడా సోద రుడి చేతుల్లో ఉంది. దీంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా అనేక పెద్ద మిల్లులకు ఐదేళ్ల పాటు పని భారీగా పెరిగిపో యింది.వచ్చిన లక్షల టన్నుల రేషన్ బియ్యాన్ని సార్టెక్స్ మిల్లుల్లో పాలిష్ చేసి పేర్లు పెట్టి గోనెసంచుల్లో ప్యాకిం గ్‌లు చేసి పోర్టుకు తరలించేవారు.కిలో రూ.10లకు కొనుగోలు చేసి రూ.70 చొప్పున విదేశాలకు ఎగుమతి చేసి కోట్లకు కోట్లు సంపాదించారు. పౌరసరఫ రాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారికంగా చెప్పిన లెక్క ల ప్రకారం వైసీపీ చివరి మూడేళ్లలో పోర్టు నుంచి రూ.48 వేల కోట్ల విలువైన కోటి 30 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం విదేశాలకు తరలించింది. అంటే రేషన్ మాఫియా ఏ స్థాయిలో వేళ్లూనుకు పోయిందో అర్థం చేసుకోవచ్చు.ద్వారంపూడిసోదరుడు వీరభద్రారెడ్డి, ద్వా రంపూడి అనుచరుడు వినోద్ అగర్వాల్ కంపెనీ సరళ, మరో రెండు కంపెనీలు ఐదేళ్లలో ఏకంగా రూ.4,990 కోట్లకుపైగా బియ్యాన్ని విదేశాలకు అమ్మేశాయి.
జ..గన్ పెట్టి.. వాటాలు కొట్టేశారు..
కాకినాడలో ప్రైవేటు పోర్టు అయిన డీప్ వాటర్ పోర్టులో ప్రధాన వాటాదారుడు కేవీ రావు. ఇతన్ని గన్‌లు పెట్టి బెదిరించి ఏకంగా బలవంతంగా వాటాలు రాయించేసుకున్న వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా దుమా రం రేపుతోంది.అప్పటి సీఎం జగన్ ఆదేశాలతో టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి ఈ బెదిరింపుల్లో పాల్గొనడం సంచలనం రేపుతోంది.ఈ పోర్టు నిర్వహణ కన్సార్టియంలో కేవీ రావుకు 41.12 శాతం వాటా కింద 2.15 కోట్ల షేర్లు ఉన్నాయి. దీంతో ఈయన సీఎండీగా ఉన్నారు. లాభాల్లో 22 శాతం వాటా కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.100 కోట్ల వరకు ఆదాయం చెల్లిస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాకినాడ సీపోర్టుపై జగన్ కన్ను పడింది. దీని సంగతి తేల్చడానికి ఎంపీ మిథున్‌రెడ్డిని రంగంలోకి దించారు. ఈయన విజిలెన్స్ అధికారులతో పాటు తమకు అనుకూలమైన సంతానం అనే ఆడిట్ సంస్థను చెన్నై నుంచి రంగంలోకి దించారు. ఈ సంస్థ కొన్ని నెలల పాటు సీపోర్టులో రికార్డుల ఆడిట్ నిర్వహించి పలు లోపాలను సర్కారు పెద్ద సారుకు కావాల్సిన విధంగా గుర్తించింది. అంతర్గత ఆడిట్‌లో కేవీరావు రూ.994కోట్లు ప్రభుత్వానికి ఎగేసి నట్టు లెక్కలు సృష్టించారు.ఈ నివేదికను చూపించి కేవీరావు మెడపై కత్తిపెట్టారు.అలా కేవీ రావు 41.12 శా తం వాటా బలవంతంగా లాగేసుకున్నారు.అందులో భా గంగా రూ.2,500 కోట్ల విలువైన తన వాటాకు కేవ లం రూ.494 కోట్లు ఇచ్చి లాగేసుకున్నారని కేవీరావు ఇటీవల సీఐడీకి ఫిర్యాదు చేశారు.ఈ అరాచకం వెనుక ఉన్న విక్రాంత్‌రెడ్డి,విజయసాయిరెడ్డితో పాటు మరో ముగ్గురి పై సీఐడీ కేసు నమోదు చేసింది.అటు ‘ఆంధ్ర జ్యోతి’ కథనాల నేపథ్యంలో వాటాల అంశంపై దర్యాప్తు చేసి అక్రమార్కులను అరెస్ట్ చేసేందుకు వీలుగా ప్రభు త్వం కదులుతోంది.సీఐడీకి విచారణ బాధ్యత అప్పగిం చడం తో ఇటీవల అధికారులు సీపోర్టుకు వచ్చి తనిఖీలు చేశా రు. పూర్తిగా తీగలాగే ప్రయత్నం చేస్తున్నారు.
అక్రమాలకు ద్వారాలు తెరిచేశారిలా..
ఏడాది పోర్టు పేరు తరలింపు
2018-19 యాంకరేజ్ 16 లక్షల మెట్రిల్ టన్నులు
2019-20 యాంకరేజ్ 19 లక్షల మెట్రిల్ టన్నులు
2020-21 యాంకరేజ్ 27 లక్షల మెట్రిల్ టన్నులు
2021-22 యాంకరేజ్ 29 లక్షల మెట్రిల్ టన్నులు
2022-23 యాంకరేజ్ 38 లక్షల మెట్రిల్ టన్నులు
2023-24 యాంకరేజ్ 24 లక్షల మెట్రిల్ టన్నులు
దోపిడీ ఎంతలా జరిగిందో ఈ ఒక్క టేబుల్ చెప్పేస్తుంది. ఎందుకంటే 2018-19 అంటే గత టీడీపీ ప్రభుత్వంలో కేవలం 16 లక్షల మెట్రిక్ టన్నులే పోర్టు కేంద్రంగా ఎగమతులు చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత చూశారా.. ఎగుమతులు అమాంతం పెరిగిపోయాయి.
ప్రభుత్వం మారింది..పట్టేశారు!
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రేషన్ బియ్యం మాఫియాపై ప్రత్యేక దృష్టిసారించింది. సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలతో స్వ యంగా మంత్రి నాదెండ్ల కాకినాడకు వచ్చి పోర్టుతో సహా గోదాములన్నీ ఈ ఏడాది జూలైలో తనిఖీ చేశా రు.రూ.157 కోట్ల విలువైన 50,647 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ల్యాబ్‌కు పంపడం ద్వారా 26,488 మెట్రిక్ టన్నులను రేషన్ బియ్యంగా గుర్తించారు.రేషన్ బియ్యం నేరుగా ప్యాకింగ్‌తో పోర్టుకు తరలిపోతుండడంతో కొత్తగా పోర్టు పరిసరాల్లో రేయింబవళ్లు పనిచేసేలా రెండు సమీకృత చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రతి బియ్యం లారీని తనిఖీ చేసి శాంపిళ్లు సేకరించేలా నిఘా పెట్టా రు.కానీ రేషన్ మాఫియా ఒత్తిళ్లతో రాత్రివేళ తనిఖీలు నిలిచిపోయాయి.ఈ నేపథ్యంలో స్టెల్లా నౌకలో బియ్యం లోడింగ్ చేస్తుండగా అందులో 640 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్టు కాకినాడ కలెక్టర్ షాన్‌మోహ న్ గతనెల 27న గుర్తించారు.ఆ తర్వాత 29న పవన్‌క ల్యాణ్ కాకినాడ వచ్చి నౌక వద్దకు వెళ్లి రేషన్‌బియ్యం ఉన్న షిప్‌ను సీజ్ చేయాలని ఆదేశించారు.అప్పటి నుంచి కాకినాడలో రేషన్ బియ్యం మాఫియాపై రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత చర్చ జరిగింది. అదే సమ యంలో ఆంధ్రజ్యోతిలో వరుసగా పలు సంచలనాత్మక కథ నాలు రావడంతో బియ్యం మాఫియాను తేల్చడానికి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సిట్ త్వరలో కాకినాడలో దర్యాప్తు చేయనుంది.