Share News

పాడి పశువుల సంక్షేమానికి ‘పశుగణన’

ABN , Publish Date - Oct 26 , 2024 | 12:04 AM

సర్పవరం జంక్షన్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): పాడి పశువుల సంక్షేమంతో పాటూ పాడిరైతుల అభ్యున్నతికి పశుగణన ఎంతగానో దోహ దం చేస్తుందని కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పం తం నానాజీ తెలిపారు. 21వ అఖిల భారత పశుగణన ఏపీ కార్యక్రమం శుక్రవారం గొడారిగుంటలో పశుసంవర్థకశాఖ జా

పాడి పశువుల సంక్షేమానికి ‘పశుగణన’
పశుగణన పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే

కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే నానాజీ

సర్పవరం జంక్షన్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): పాడి పశువుల సంక్షేమంతో పాటూ పాడిరైతుల అభ్యున్నతికి పశుగణన ఎంతగానో దోహ దం చేస్తుందని కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పం తం నానాజీ తెలిపారు. 21వ అఖిల భారత పశుగణన ఏపీ కార్యక్రమం శుక్రవారం గొడారిగుంటలో పశుసంవర్థకశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ సూ ర్య ప్రకాశరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పశుగణన కార్యక్రమం మంచి కార్యక్రమని, ఇది అక్టోబరు 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు జరుగుతుందన్నా రు. ఈ గణనలో భాగంగా పశువుల సమగ్ర స మాచారంతో పాటూ రైతులకు చెందిన వ్యవసాయ పరికరాల వివరాలను సేకరించడం మంచి పరిణామమన్నారు. ఈ సర్వేతో పాడి పరిశ్రమపై ఆధారపడి జీవించే వారి సంక్షేమం, అభివృద్ధికి తోడ్పాటు అందించేందుకు వీలుంటుందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పశుగణనలో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, గుర్రాలు, పందులు తదితర 16 రకాల పెంపుడు జంతువుల సమాచారాన్ని సేకరించడం జరుగుతుందని డిప్యూటీ డైరెక్టర్‌ సూర్యకుమారి తెలిపారు. కార్యక్రమంలో పశుసంవర్థశాఖ వైద్యాధికారి డాక్టర్‌ టీవీ సురేష్‌, ఎంవీ రవికిరణ్‌, నాయకులు శిరంగు శ్రీనివాసరావు,పాండ్రంకి రాజు ఉన్నారు.

కేంద్రం నిర్ణయంపై హర్షం

ఏపీ రాష్ట అభివృద్ధికి బాటలు వేసేలా రూ. 2,245 కోట్లతో కొత్త రైలు మార్గం ఏర్పాటుకు కేంద్ర మంత్రి మండలి నిర్ణయించడం పట్ల కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ హర్షం వ్యక్తం చేశారు. గొడారిగుంటలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాకినాడ పోర్టుకు కొత్త రైలు మార్గం కనెక్టివిటీకి అనుసంధానం చేసేలా కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలపడంతో రానున్న రోజుల్లో కాకినాడ పోర్టుకు మహర్దశ పట్టనుందన్నారు. దీంతో కాకినాడ జి ల్లా వాణిజ్య, వ్యాపార పరంగా జిల్లా క్రియాశీలంగా మారనుందన్నారు. అమరావతి రైల్వేలైన్‌ కచ్చితంగా మోడల్‌ రైలు మార్గంగా నిలవనుందన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ విశేష కృషి చేస్తున్నారన్నారు. పవన్‌ కృషికి చంద్రబాబు అను భవం తోడవ్వడంతో ప్రధాని మోదీ కొత్త రైలు మార్గానికి నిధులు మంజూరు చేశారన్నారు.

Updated Date - Oct 26 , 2024 | 12:04 AM