Share News

పనుల్లో ప్రజల భాగస్వామ్యం ఉం డాలి

ABN , Publish Date - Oct 18 , 2024 | 11:37 PM

కాకినాడ రూరల్‌, అక్టోబరు 18: గ్రామాల్లో జరుగుతున్న పనుల్లో ప్రజల భాగస్వామ్యం ఉం డాలని కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ సూచించారు. పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం గంగనాపల్లి, చీడిగ, ఇంద్ర పాలెం గ్రామాల్లో రూ.2.10 కోట్ల ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో నిర్మించనున్న సీసీ రో

పనుల్లో ప్రజల భాగస్వామ్యం ఉం డాలి
మహిళల సమస్యలు తెలుసుకుంటున్న నానాజీ

కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే నానాజీ

కాకినాడ రూరల్‌, అక్టోబరు 18: గ్రామాల్లో జరుగుతున్న పనుల్లో ప్రజల భాగస్వామ్యం ఉం డాలని కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ సూచించారు. పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం గంగనాపల్లి, చీడిగ, ఇంద్ర పాలెం గ్రామాల్లో రూ.2.10 కోట్ల ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కనెక్టింగ్‌ లింక్‌ రోడ్లు వంటి పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నానాజీ శంకుస్థాపన చేసి శ్రీకారం చుట్టారు. అనంతరం మాట్లాడుతూ ఆగస్టు 22న నిర్వహించిన గ్రామసభల్లో ప్రజల నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు రూ.12.36 కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు. కార్యక్రమాల్లో కూటమి నాయకులు శిరంగు శ్రీనివాసరావు, మాసుమేను గంగయ్య, పెంకే శ్రీనివాస్‌బాబా, నురుకుర్తి వెంకటేశ్వరరా వు, డాక్టర్‌ చప్పిడి, పితాని అప్పన్న, తడాల అ బ్బు, పాండ్రంకి రాజు, మరుకుర్తి నాగబాబు, మహేష్‌, సతీష్‌, శ్రీరాములు,రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 18 , 2024 | 11:37 PM