Share News

కూటమి నాయకుల మధ్య మద్యం షాపు లీజు చిచ్చు

ABN , Publish Date - Oct 20 , 2024 | 12:28 AM

కాకినాడ సిటీ, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): కాకినాడలో ఓ మద్యం షాపు లీజు ఒప్పందం వివాదం కూటమి నాయకుల మధ్య చిచ్చు రేపుతోంది. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అనుచరుల మధ్య మద్యంషాపు ఏర్పాటుపై ఏర్పడిన తగాదా తీవ్ర ఉద్రిక్తతను దారితీసిం

కూటమి నాయకుల మధ్య మద్యం షాపు లీజు చిచ్చు
సంజయనగర్‌ ప్రాంతంలో మద్యం షాపు వద్ద మొహరించిన ఇరువర్గాలు

కాకినాడ సిటీ, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): కాకినాడలో ఓ మద్యం షాపు లీజు ఒప్పందం వివాదం కూటమి నాయకుల మధ్య చిచ్చు రేపుతోంది. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అనుచరుల మధ్య మద్యంషాపు ఏర్పాటుపై ఏర్పడిన తగాదా తీవ్ర ఉద్రిక్తతను దారితీసింది. తాము ముందు లీజుకు తీసుకు న్నామంటే, తామే ముందు లీజుకు తీసుకు న్నామని ఇరువర్గాల వారు బాహాబాహీకి దిగారు. డ్రాలో షాపు దక్కించుకున్న కాకినాడ ఎంపీ అనుచరులైన తెలంగాణకు చెందిన వ్యక్తులు కాకినాడ సంజయ్‌నగర్‌ ప్రాంతంలో మద్యంషాపు ఏర్పాటు కోసం పనులు చేయిస్తు న్నారు. ఇదే స్థలాన్ని తాము ముందుగానే లీజుకు తీసుకున్నామని రెండోవర్గం వారు అక్కడకు వచ్చి వివాదానికి దిగారు. కాకినాడ ఎమ్మెల్యే అనుచరలైన టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, స్థానిక నాయకులు వచ్చి షాపును ఖాళీ చేయాలని చెదరగొట్టే ప్రయ త్నం చేశారు. వారి అనుచరులతో మద్యం సరుకు దింపించి కొబ్బరికాయ కొట్టి అమ్మకా లు ప్రారంభించారు. ఈ సమయంలో ఎంపీ అనుచరులైన తెలంగాణ వ్యక్తులు ఇదే ప్రాం తంలో మోహరించారు. ఇరువర్గాలు ఫిర్యాదు చేసుకోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశా రు. ఈ మద్యం షాపు ఏర్పాటు విషయంలో టీడీపీ, జనసేన నాయకుల ప్రమేయం ఉండడంతో ఆధిపత్యానికి దారితీసింది.

Updated Date - Oct 20 , 2024 | 12:28 AM