Share News

ఎడ్ల పందేలు సంప్రదాయాల్లో భాగం

ABN , Publish Date - Dec 30 , 2024 | 12:33 AM

రంగంపేట, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): ఎడ్ల పందేలు, కోడి పందేలు మన సంప్రదాయాల్లో, గ్రామీణ సంస్కృతిలో భాగమని, ఇవి లేకపోతే నాణ్యమైన పశుపక్ష్యాదుల సంపద అంతరించిపోతుందని, చట్టాన్ని అతిక్రమించకుండా ఇలాంటి పందేలను ఆదరించి పోషించుకోవాలని శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మం డలం వడిశలేరు గ్రామం వద్ద గన్ని సత్యనారాయణమూర్తి స్మారక 6వ వార్షిక రాష్ట్రస్థా

ఎడ్ల పందేలు సంప్రదాయాల్లో భాగం
సీనియర్‌ విభాగంలో విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన డిప్యూటీ స్పీకర్‌, ఎమ్మెల్యే వాసు

శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజు

వడిశలేరులో రాష్ట్రస్థాయి ఎడ్లబండ్ల పరుగు పోటీలు

రంగంపేట, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): ఎడ్ల పందేలు, కోడి పందేలు మన సంప్రదాయాల్లో, గ్రామీణ సంస్కృతిలో భాగమని, ఇవి లేకపోతే నాణ్యమైన పశుపక్ష్యాదుల సంపద అంతరించిపోతుందని, చట్టాన్ని అతిక్రమించకుండా ఇలాంటి పందేలను ఆదరించి పోషించుకోవాలని శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మం డలం వడిశలేరు గ్రామం వద్ద గన్ని సత్యనారాయణమూర్తి స్మారక 6వ వార్షిక రాష్ట్రస్థాయి ఎడ్లబండ్ల పరుగు పోటీలను ఆదివారం నిర్వహించారు. పందేలను రఘురామ తిలకించి సీనియర్‌ విభాగంలో విజేతలైన రైతులకు బహుమతి ప్రదానం చేశారు. తండ్రి పేరిట ఈ పోటీలను ఏటా నిర్వహిస్తున్న జీఎస్‌ఎల్‌ సంస్థల చైర్మన్‌ గన్ని భాస్కరరావును ప్రశంసించారు. కాగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ ఈ పోటీలను ప్రారంభించారు. పోటీలను క్రమం తప్పకుండా నిర్వహించడం విశేషమన్నారు. మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ కోడి పందేలు, ఎడ్ల పందేలు లేని తెలుగు సంప్రదాయాన్ని ఊహించలేమన్నారు. జూనియ ర్‌ విభాగంలో విజేతలకు బహుమతులు ప్రదా నం చేసిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గన్నిభాస్కరరావు తెలుగు సంప్రదాయాన్ని పటిష్టం చేస్తున్నారని ప్రశంసించారు. కార్యక్రమంలో రుడా చైర్మన్‌ బొడ్డు వెంకటరమణచౌదరి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశ్‌రావు,జక్కంపూడి రాజా తదితరులు పాల్గొన్నారు.

విజేతలు వీరే...

రంగంపేట/ఆలమూరు: వడిశలేరులో జరిగిన ఎడ్లబండ్ల పరుగు పోటీల్లో సీనియర్‌ విభాగం (1600 మీటర్ల దూరం)లో కోనసీమ జిల్లా గు మ్మిలేరు గ్రామానికి చెందిన కోర సృతిచౌదరి ఎ డ్లజత మొదటి బహుమతి, అనకాపల్లి జిల్లా కేజీ పురం రైతు శ్రీఆంజనేయం ఎడ్లజత రెండో బహుమతి, కోనసీమ జిల్లా గుమ్మిలేరుకు చెందిన కోర సృతిచౌదరి ఎడ్ల జత మూడో బహుమతి గెలిచుకున్నాయి. జూనియర్‌ విభాగం(1000 మీటర్ల దూరం)లో కోనసీమ జిల్లా మండపేటకు చెందిన వేగుళ్ల కృష్ణమాధవి ఎడ్ల జత మొదటి బహుమతి, కోనసీమ జిల్లా గుమ్మిలేరు రైతు కోర సృతిచౌదరి ఎడ్ల జత రెండో బహుమతి, నెల్లూరు జిల్లా గంగపట్నం గ్రామానికి చెందిన చాముండేశ్వరీ సీఫుడ్స్‌ ఎడ్ల జత మూడో బహుమతి గెలుచుకున్నాయి. పోటీల న్యాయనిర్ణేతలైన సూరపనేని రామకృష్ణప్రసాద్‌ (కృష్ణా జిల్లా), చేకూరి రామకృష్ణ (కాకినాడ)లను సత్కరించారు.

Updated Date - Dec 30 , 2024 | 12:33 AM