Share News

కోనసీమ జిల్లా ప్రత్యేకాధికారిగా బాలాజీరావు

ABN , Publish Date - Aug 31 , 2024 | 12:12 AM

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మోనటరింగ్‌ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాకు ప్రత్యేక అధికారిని నియమించింది.

కోనసీమ జిల్లా ప్రత్యేకాధికారిగా బాలాజీరావు

అమలాపురం, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మోనటరింగ్‌ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాకు ప్రత్యేక అధికారిని నియమించింది. 2011 ఐఏఎస్‌ కేడర్‌కు చెందిన సెటిల్‌మెంట్స్‌ అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ సర్వే డైరెక్టర్‌ లత్కర్‌ శ్రీకేష్‌ బాలాజీరావును ప్రత్యేకాధికారిగా నియమించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసే పథకాలను మోనటరింగ్‌ చేయడంతో పాటు ప్రత్యేక సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. త్వరలోనే బాలాజీరావు జిల్లాలో పర్యటించే అవకాశం ఉంది.

Updated Date - Aug 31 , 2024 | 12:12 AM