48 గంటలపాటు మద్యం బంద్
ABN , Publish Date - Dec 03 , 2024 | 12:02 AM
కలెక్టరేట్ (కాకినాడ), డిసెంబరు 2(ఆంధ్ర జ్యోతి): తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల ఉపా ధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో 48గంటలపాటు మద్యం దుకాణాలను బంద్ చేస్తున్నామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్ తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పోలింగ్
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నిర్ణయం
ఉభయగోదావరి జిల్లాల్లో పోలింగ్ కేంద్రాలకు
సమీపంలోని మద్యం దుకాణాలకు నిబంధన వర్తింపు
కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్
కలెక్టరేట్ (కాకినాడ), డిసెంబరు 2(ఆంధ్ర జ్యోతి): తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల ఉపా ధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో 48గంటలపాటు మద్యం దుకాణాలను బంద్ చేస్తున్నామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్ తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పోలింగ్ కేంద్రాలకు సమీపం లోని మద్యం దుకాణాలకు ఈ నిబంధన వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన వెలువరించారు. మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి ఈనెల 5వతేదీ సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కేంద్రా లకు సమీపంలోని మద్యం దుకాణాలను ఏపీ ప్ర భుత్వ చీఫ్ ఎలక్టోరల్ అధికారి ఆదేశాల మేరకు బంద్ చేస్తున్నామన్నారు. ఉపాధ్యాయ ఎమెల్సీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహిం చాలనే లక్ష్యంతో మద్యం దుకాణాలను మూసి వేయాలని ఆదేశించామని ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించాలి
కలెక్టరేట్ (కాకినాడ), డిసెంబరు 2 (ఆంధ్ర జ్యోతి): ఈనెల 5న జిల్లాలో జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతమైన వాతావరణంలో సమర్థంగా నిర్వహించాలని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ సహాయ రిటర్నింగ్ అధికారి, డీఆర్వో జె.వెంకట్రావు అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కాకినాడ కలెక్ట రేట్‌లో పోలింగ్ అధికారులు, సిబ్బందికి సోమ వారం ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపా ధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించాలన్నారు. ఆరు జిల్లాల పరిధిలో 16,737 మంది ఓటర్లు ఉండగా 116 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కాకినాడ జిల్లాలో ప్రత్యేకంగా 3418 మంది ఓట ర్లు ఉండగా వారి కోసం 22 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ ఈనెల 5న ఉద యం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందన్నారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను సురక్షితంగా కాకినాడ జేఎన్ టీయూలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సెంట్రల్ లైబ్రరీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రప ర్చుతామని ఆయన తెలిపారు. తొలుత పోలింగ్ ప్రక్రియపై పీవోలు, ఏపీవోలు, ఓపీవోలు, మైక్రో అబ్జర్వర్లు, సెక్టార్ అధికారులకు అవగాహన కల్పించారు. పోలింగ్ కేంద్రాల్లో విధులు, పోలింగ్ ప్రక్రియ, పోలింగ్ మెటీరియల్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్, పీవో డైరీ, మైక్రో అబ్జర్వర్ల విధులు, ఫర్నీచర్, విద్యుత్తు, పోలింగ్ రోజున అనుసరిం చాల్సిన విధానాలపై సిబ్బందితో చర్చించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఎన్నికల విభాగం డిప్యూటీ తహసీల్దార్ జగన్నాథం పాల్గొన్నారు.