Share News

Stella ship: స్టెల్లా నౌకపై త్వరలో నిర్ణయం

ABN , Publish Date - Dec 17 , 2024 | 04:26 PM

Andhrapradesh: కాకినాడ పోర్టుల బియ్యం ఎగుమతులకు సంబంధించి మరిన్ని ఆధారాలను అధికారులు పట్టుకున్నారు. స్టెల్లా నౌకలో ఇప్పటికే 647 టన్నుల రేషన్ బియ్యం ఉన్న నేపథ్యంలో దాన్ని ఇప్పటికే గడిచిన నెలరోజులుగా సముద్రంలోనే నిలిపివేశారు. ఇటీవల పది మంది అధికారుల బృందం షిప్‌‌లో తనిఖీలు చేశారు.

Stella ship: స్టెల్లా నౌకపై త్వరలో నిర్ణయం
Stella Ship

కాకినాడ, డిసెంబర్ 17: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) కాకినాడ పోర్టును పరిశీలించిన తర్వాత అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. స్టెల్లా షిప్ (Stella Ship) ద్వారా పీడీఎస్ బియ్యాన్ని విదేశాలకు తరలిస్తున్నారన్న సమాచారంతో గత నెల 29న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా అధికారులతో కలిసి నౌకను పరిశీలించారు. రేషన్ బియ్యం తరలింపు విషయంలో ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో అధికారులు రంగంలోకి దిగారు.

అదృష్టం అంటే ఇతడిదే.. అంత పెద్ద ప్రమాదం జరిగినా..


ఐదు విభాగాల అధికారులు ప్రత్యేక బృందంగా ఏర్పడి స్టెల్లా షిప్‌లోని ఐదు కంపార్ట్‌మెంట్లలో తనిఖీలు నిర్వహించి 12 బియ్యం శాంపిల్స్‌ను సేకరించినట్లు జిల్లా కలెక్టర్ శాన్ మోహన్ తెలిపారు. స్టెల్లా షిప్‌లో 1320 టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లు నిర్ధారించినట్లు చెప్పారు. ఈ బియ్యాన్ని అంతా సత్యం బాలాజీ అనే కంపెనీకి ఎగుమతి చేస్తున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. వీరు ఎక్కడి నుంచి బియ్యాన్ని తీసుకువచ్చారు.. ఎక్కడ నిల్వ చేశారనే దానిపై దర్యాప్తు జరుగుతోందన్నారు. ఈ కంపెనీపై విచారణ చేస్తున్నామన్నారు. ఈ బియ్యాన్ని షిప్ నుంచి ఆన్‌లోడ్ చేస్తామని తెలిపారు. ఇంకా 12వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఉందని.. షిప్‌లో ఉన్న రేషన్ బియ్యం 48 గంటల్లో కిందకు దించేయాలన్నారు. ఆ తర్వాత మిగిలిన బియ్యం లోడ్ చేస్తామని కలెక్టర్ శాన్ మోహన్ పేర్కొన్నారు.


కాకినాడ పోర్టుల బియ్యం ఎగుమతులకు సంబంధించి మరిన్ని ఆధారాలను అధికారులు పట్టుకున్నారు. స్టెల్లా నౌకలో ఇప్పటికే 647 టన్నుల రేషన్ బియ్యం ఉన్న నేపథ్యంలో దాన్ని ఇప్పటికే గడిచిన నెలరోజులుగా సముద్రంలోనే నిలిపివేశారు. ఇటీవల పది మంది అధికారుల బృందం షిప్‌‌లో తనిఖీలు చేసి మొత్తం 34 వేల మెట్రిక్‌ టన్నులు లోడైన బియ్యంలో 12 రకాల శాంపిల్స్ తీసి వాటిని ల్యాబ్‌కు తరలించారు. దానికి సంబంధించి ఫలితాలు రావడంతో కలెక్టర్ శాన్ మోహన్ ఈరోజు (మంగళవారం) మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. షిప్‌లో లోడై ఉన్న 34 వేల మెట్రిక్ టన్నుల బియ్యంలో దాదాపు 1320 టన్నుల రేషన్ బియ్యం ఉందని ప్రకటించారు.


గత నెలలో డిప్యూటీ సీఎం షిప్‌లో తనిఖీలు చేయగా.. 640 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం ఉందని, దీన్ని సీజ్ చేయాలని ప్రకటించారు. ఆ తరువాత షిష్‌లోని మరిన్ని కంపార్ట్‌మెంట్లలో తనిఖీలు నిర్వహించగా వచ్చిన ఫలితాల ప్రకారం 1320 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం ఉందని గుర్తించారు. ఈ బియ్యం ఛత్తీస్‌గడ్‌కు చెందిన సత్యం బాలాజీ అనే కంపెనీకి చెందినదిగా గుర్తించారు. ఈ నేపథ్యంలో లోడైన బియ్యాన్ని రేపటి నుంచి 48 గంటల్లో షిప్‌లో నుంచి దించివేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. దించేసిన బియ్యాన్ని కాకినాడ పోర్టుకు తెచ్చి స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. ఆ తరువాత మిగిలిన బియ్యాన్ని లోడ్‌ చేసి షిప్‌‌ను పంపించి వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 35 రోజుల నుంచి స్టెల్లా షిప్‌ కాకినాడలో నిలిచిపోయిన విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి...

టీడీపీలో ‘జోగి’ రచ్చ

తండ్రీకొడుకులకు బిగ్ షాక్..

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 17 , 2024 | 04:26 PM