Stella Ship: కాకినాడ నుంచి స్టెల్లా నౌక వద్దకు బయలుదేరిన అధికారులు
ABN , Publish Date - Dec 04 , 2024 | 10:36 AM
కాకినాడ పోర్టులోని స్టెల్లా నౌకను సీజ్ చేయడం అసాధ్యమని అధికారులు నిర్దారణకు వచ్చినట్లు సమచారం. నౌక సీజ్ కోసం కేసు పెట్టిన అడ్మిరాలజీ న్యాయస్థానంలో నిలబడే అవకావం చాలా తక్కువని భావిస్తున్నారు. పైగా మరో దేశానికి చెందిన నౌకను సీజ్ చేయడం కష్టమైన పని, నిపుణులతో మాట్లాడిన తర్వాత ఓ అంచనాకు వచ్చారు.
తూర్పుగోదావరి జిల్లా: కాకినాడ (Kakinada) నుంచి అధికారుల బృందం (Officers) స్టెల్లా నౌక (Stella Ship) వద్దకు బయలుదేరారు. నౌకలో మిగిలిన బియ్యాన్ని పరిశీలించనున్నారు. బియ్యం శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌లో పరిశీలించనున్నారు. ఇందులో ఎంత రేషన్ బియ్యం వున్నాయో గుర్తించి సీజ్ చేసి నౌకను పంపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నౌకలో పూర్తి బియ్యం లోడింగ్‌కు ఇంకా వారం రోజుల వ్యవధి పట్టే అవకాశం ఉంది.
స్టెల్లా నౌకను సీజ్ చేయడం అసాధ్యం..
కాకినాడ పోర్టులోని స్టెల్లా నౌకను సీజ్ చేయడం అసాధ్యమని అధికారులు నిర్దారణకు వచ్చినట్లు సమచారం. నౌక సీజ్ కోసం కేసు పెట్టిన అడ్మిరాలజీ న్యాయస్థానంలో నిలబడే అవకావం చాలా తక్కువని భావిస్తున్నారు. పైగా మరో దేశానికి చెందిన నౌకను సీజ్ చేయడం కష్టమైన పని, నిపుణులతో మాట్లాడిన తర్వాత ఓ అంచనాకు వచ్చారు. ఇటీవల కాకినాడలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బియ్యం లోడవుతున్న నౌకను సీజ్ చేయాలని ఆదేశించారు. అయితే అప్పటికే తుపాన్ ముప్పువల్ల సముద్రం అల్లకల్లోలంగా మారడంతో నౌకలోని లోడింగ్ నిలిచిపోయింది. అయితే ఇప్పుడు తుఫాన్ ముప్పు తొలగిపోయింది. దీంతో పోర్టులో మిగిలిపోయిన బియ్యం లోడింగ్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఒకవేళ లోడింగ్ చేయకపోతే డామరేజ్ భారంపడనుంది.
ఏపీ ప్రభుత్వం స్పందన..
కాగా కాకినాడ నుంచి యథేచ్ఛగా రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోతున్న వైనంపై ఏపీ ప్రభుత్వం (AP Govt.) స్పందించింది. ఈ నేపథ్యంలో స్టెల్లా నౌక (Stella Ship) సీజ్ (Seize)కు న్యాయపరంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కస్టమ్స్ నిబంధనలు అడ్డు వస్తుండడంతో అడ్మిరాలిటీ కోర్టును ఆశ్రయించాలని సర్కార్ నిర్ణయించింది. పౌరసరఫరాల శాఖ ద్వారా పిటిషన్ వేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. న్యాయపరమైన చిక్కులు అధిగమించేలా రాష్ట్ర ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రంగంలోకి దిగారు. కోర్టులో పిటిషన్ వేసిన తర్వాత సీజ్ ఆర్డర్ రావడానికి కేసు ఎలా ఉండాలనేదానిపై అధికారులతో సమాలోచనలు చేస్తున్నారు. కాగా సముద్రంలో వాతావరణం అనుకూలంగా వుండడంతో బియ్యం లోడింగ్ చేయాలని షిప్పింగ్ ఏజెంట్స్ కోరుతున్నారు. లేదంటే డెమరేజ్ భారం పడుతుందని వాదిస్తున్నారు. మరోవైపు నౌకకు నోడ్యూ సర్టిఫి కెట్ ఇవ్వకుండా ఎక్కువ రోజులు అపలేమని పోర్ట్ సిబ్బంది చెబుతున్నారు. సాధ్యమైనంత వేగంగా కేసు ఓ కొలిక్కి వచ్చేలా చూడాలని అధికారులు అంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ బంధువుల్లో నోటీసుల కలకలం..
రాజధాని నివాసిగా ఏపీ సీఎం చంద్రబాబు
కోహ్లీకి గాయం.. రెండో టెస్ట్‌కు డౌట్..
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో టీం..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News