Share News

పారిశ్రామికవేత్తల సహకారం అవసరం

ABN , Publish Date - Nov 07 , 2024 | 12:08 AM

పెద్దాపురం, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): గ్రామాల అభివృద్ధికి పారిశ్రామికవేత్తల సహ కారం ఎంతో అవసరమని ఎమ్మెల్యే నిమ్మ కాయల చినరాజప్ప అన్నారు. మండలంలోని సీబీ దేవం గ్రామంలో కేబీకే బయోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ఆర్థిక సహకారంతో గ్రామంలో నిర్మించనున్న కల్యాణమండప నిర్మాణానికి

పారిశ్రామికవేత్తల సహకారం అవసరం
సీబీ దేవం గ్రామంలో శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చినరాజప్ప

ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప

పెద్దాపురం, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): గ్రామాల అభివృద్ధికి పారిశ్రామికవేత్తల సహ కారం ఎంతో అవసరమని ఎమ్మెల్యే నిమ్మ కాయల చినరాజప్ప అన్నారు. మండలంలోని సీబీ దేవం గ్రామంలో కేబీకే బయోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ఆర్థిక సహకారంతో గ్రామంలో నిర్మించనున్న కల్యాణమండప నిర్మాణానికి జన సేన కాకినాడ జిల్లా ఇన్‌చార్జ్‌ తుమ్మల రామ స్వామి (బాబు)తో కలసి బుధవారం భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్పోరేట్‌ సంస్థలు సమీప గ్రామాలను దత్తత తీసుకోవాలని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తమవంతు సహకారం అందించాలన్నారు. ప్రతీ ఒక్క పారిశ్రామికవేత్త గ్రామాల అభివృద్ధిని తమ బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. సీబీ దేవం గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్న కేబీకే బయోటెక్‌ యాజమాన్యాన్ని వారు అభినందిం చారు. కేబీకే బయోటెక్‌ పరిశ్రమ చైర్మన్‌ కుం దుల బలరామకృష్ణ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముర ళీకృష్ణ, ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ సురే్‌ష్‌కుమార్‌ టీడీ పీ నాయకులు ఆచంట వెంకట్రాజు, గంగాధర్‌, కంచుమర్తి కాటంరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 07 , 2024 | 12:08 AM