Share News

పిఠాపురంలో అర్బన్‌ బ్యాంకు ఎన్నికల సందడి

ABN , Publish Date - Sep 26 , 2024 | 12:33 AM

పిఠాపురం, సెప్టెంబరు 25: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అర్బన్‌బ్యాంకుల్లో ప్రత్యేకస్థానం కలిగి ఉన్న నాటి పిఠాపురం కోఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు, నేటి పిఠాపురం కోఆపరేటివ్‌ అర్బన్‌ క్రెడిట్‌ కోపరేటివ్‌ సొసైటీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. అర్బన్‌ సొసైటీ ఎన్నికలకు ఎన్నికల అధికారి పి.దుర్గాప్రసాద్‌ నోటిఫికేషన్‌ జా

పిఠాపురంలో అర్బన్‌ బ్యాంకు ఎన్నికల సందడి

రేపటి నుంచి నామినేషన్లు ప్రారంభం

పిఠాపురం, సెప్టెంబరు 25: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అర్బన్‌బ్యాంకుల్లో ప్రత్యేకస్థానం కలిగి ఉన్న నాటి పిఠాపురం కోఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు, నేటి పిఠాపురం కోఆపరేటివ్‌ అర్బన్‌ క్రెడిట్‌ కోపరేటివ్‌ సొసైటీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. అర్బన్‌ సొసైటీ ఎన్నికలకు ఎన్నికల అధికారి పి.దుర్గాప్రసాద్‌ నోటిఫికేషన్‌ జారీ చేశా రు. అక్టోబరు 6న ఎన్నికలు జరగనున్నాయి. సంఘంలో డిపాజిటర్లతో కలిపి 2011 మంది సభ్యులు ఉన్నారు. సొసైటీని 5 వార్డులుగా విభజించారు. ఇందులో1,3,4వార్డులను డిపాజిటర్లకు, 2,5వార్డులను సాధారణ సభ్యులకు కేటాయించారు. పిఠాపురం పట్టణంతో పాటు చిత్రాడ, కుమారపురం, కొండెవరం, నవఖండ్రవాడ, శొంఠివారిపాకలు, మాధవపురం, నర్సింగపురం తదితర గ్రామాల్లో సొసైటీకి సభ్యులున్నారు. గతం పాలకవర్గం గడువు 2024 ఆగస్టుతో ముగిసింది. ఎన్నికలకు 27న ఉదయం 11నుంచి సాయంత్రం 5గంటల వరకూ నామినేషన్లు స్వీకరించనున్నారు. 28న నామినేషన్ల పరిశీలన, 29న సాయంత్రం 5గంటల వరకూ నామినేషన్ల ఉపసంహరణ, అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటన ఉంటుంది. పోటీ ఉంటే అక్టోబరు 6న ఉదయం 8నుంచి మధ్యాహ్నం 3గంటల వరకూ పోలింగ్‌, తదనంతరం కౌంటింగ్‌, ఎన్నికల ఫలితాల ప్రకటన జరుగుతుంది. 7న ఉదయం 8గంటలు నుంచి అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నిక జరుగుతుంది. బ్యాలెట్‌ పద్దతిలో ఎన్నిక జరుగుతుంది.

Updated Date - Sep 26 , 2024 | 12:33 AM