Share News

‘పిఠాపురం మహారాజా చేసిన కృషి నిరుపమానం’

ABN , Publish Date - Oct 06 , 2024 | 12:05 AM

పిఠాపురం, అక్టోబరు 5: విద్యా, వైద్యరంగాల అభివృద్ధికి వేలాది ఎకరాల భూమిని దానమివ్వడమే గాకుండా ఆయా సంస్థల ఏర్పాటుకు పిఠాపురం మహారాజా చేసిన కృషి నిరుపమానమని పలువురు వక్తలు కొనియాడారు. ఆదిత్య విద్యాసంస్థలు, పిఠాపురం మహారాజా ఫౌండేషన్‌ ఆ ధ్వర్యంలో పిఠాపురం మహారా

‘పిఠాపురం మహారాజా చేసిన కృషి నిరుపమానం’
మహారాజా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న వర్మ, మర్రెడ్డి, శేషారెడ్డి

పిఠాపురం, అక్టోబరు 5: విద్యా, వైద్యరంగాల అభివృద్ధికి వేలాది ఎకరాల భూమిని దానమివ్వడమే గాకుండా ఆయా సంస్థల ఏర్పాటుకు పిఠాపురం మహారాజా చేసిన కృషి నిరుపమానమని పలువురు వక్తలు కొనియాడారు. ఆదిత్య విద్యాసంస్థలు, పిఠాపురం మహారాజా ఫౌండేషన్‌ ఆ ధ్వర్యంలో పిఠాపురం మహారాజా రాజా వెంకట మహీపతి సూర్యారావు బహద్దూర్‌ జయంతిని శనివారం నిర్వహించారు. కోటగుమ్మం సెంటర్‌లోని మహారాజా విగ్రహానికి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీ ఎస్‌ఎన్‌ వర్మ, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు, ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్‌ నల్లమిల్లి శేషారెడ్డిలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 3 రోజులు పాటు నిర్వహించిన ఇంటర్‌స్కూల్‌ స్పోర్ట్స్‌ కాంపిటేషన్స్‌లో విజేతలకు బహుమతులు,షీల్డులు అందజేశారు. వి ద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్‌ ఎన్‌.శృతిరెడ్డి, పాదగయ మాజీ చైర్మన్‌ కొండేపూడి సూర్యప్రకాష్‌, ఎస్‌ఎం.ఆలీ, ప్రిన్సిపాల్‌ విజయసారధి, బ్లూమింగ్‌ మైండ్స్‌ ఇన్‌చార్జి శ్రీనివాస్‌, కిండర్‌ వండర్‌ ఇన్‌చార్జి రేవతి పాల్గొన్నారు.

Updated Date - Oct 06 , 2024 | 12:05 AM