Share News

ఆసుపత్రికి తాళాలు

ABN , Publish Date - Sep 03 , 2024 | 12:41 AM

ప్రత్తిపాడు, సెప్టెంబరు 2: కాకినాడ జిల్లా ప్రత్తిపాడులోని హోమియో ఆసుపత్రికి సుస్తీ చేసింది. గడిచిన రెండు నెలలుగా ఈ హోమియో ఆసుపత్రి సక్రమంగా పనిచేయడం లేదు. ఆసుపత్రి భవన ప్రధాన ద్వారం తలుపులు ఎప్పుడు చూసినా తాళం వేసి మూసే ఉంటున్నాయి. తెరుచుకోని ఈ ఆసుపత్రి వల్ల హోమియో మందుల కోసం వచ్చే వ్యాధిగ్రస్తులు ఆసుపత్రి మూతబడి ఉండడంతో వెనుదిరిగి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. నెలలు తరబడి ఆసుపత్రి సేవలు అందక హోమియో రోగు లు అవస్థలు పడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. మెట్ట ప్రాంతంలోని హోమియో వై

ఆసుపత్రికి తాళాలు
హోమియో ఆసుపత్రి ప్రధాన ద్వారానికి తాళం వేసిన దృశ్యం

అందని వైద్య సేవలు

రెండు నెలలుగా ఇంతే

అయినా పట్టించుకోని అధికారులు

ప్రత్తిపాడు, సెప్టెంబరు 2: కాకినాడ జిల్లా ప్రత్తిపాడులోని హోమియో ఆసుపత్రికి సుస్తీ చేసింది. గడిచిన రెండు నెలలుగా ఈ హోమియో ఆసుపత్రి సక్రమంగా పనిచేయడం లేదు. ఆసుపత్రి భవన ప్రధాన ద్వారం తలుపులు ఎప్పుడు చూసినా తాళం వేసి మూసే ఉంటున్నాయి. తెరుచుకోని ఈ ఆసుపత్రి వల్ల హోమియో మందుల కోసం వచ్చే వ్యాధిగ్రస్తులు ఆసుపత్రి మూతబడి ఉండడంతో వెనుదిరిగి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. నెలలు తరబడి ఆసుపత్రి సేవలు అందక హోమియో రోగు లు అవస్థలు పడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. మెట్ట ప్రాంతంలోని హోమియో వైద్యసేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంకోసం మూడు దశాబ్దాల కిందట మండలంలోని ధర్మవరంలో హోమియో ఆసుపత్రిని ఏర్పాటుచేశారు. అక్కడ కొంతకాలం పనిచేసిన ఈ ఆసుపత్రిని ప్రత్తిపాడులోని వైద్య విధాన పరిషత్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ ప్రాంగణంలోకి ఉన్నతాధికారులు తరలించారు. సాధారణ వైద్యంతోపాటు హోమియో వైద్యం కూడా ఒకే కాం పౌండులో ఉంటుందనే ఉద్దేశంతో అధికారులు స్థానిక కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు చెందిన భవనంలో ఈ ఆసుపత్రిని ఏర్పాటుచేశారు. కొన్నేళ్లపాటు ఈ ఆసుపత్రి సేవలు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల ప్రజలకు సేవలు అందించడంతోపాటు పరిసర నియోజకవర్గ గ్రామాలకు చెందిన ప్రజలు కూడా ఈ ఆసుపత్రి సేవలను వినియోగించుకునేవారు. ఈ ఆసుపత్రికి సొంత భవనం ఏర్పాటుచేయాలని, హోమియో వైద్యం అందించే ఆయుష్‌శాఖ నిధులు మంజూరుచేయడంతో కమ్యూనిటీహెల్త్‌ సెంటర్‌లోని సీమాంక్‌ వార్డుకు ఎదురుగా నూతనంగా హోమియో ఆసు పత్రిని నిర్మించారు. నూతన హోమియో ఆసుపత్రిలోకి మారకుండానే ఈ హోమియో వైద్యశాల సిబ్బంది కొరత కారణంగా మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు. కాకినాడ జిల్లాలో కాకినాడ, దివిలి, ప్రత్తిపాడు, కోరంగి, పెరుమళ్ళపురం, అల్లిపూడిలలో హోమియో వైద్యశాలలు ఉండగా కాకినాడ, దివిలి వైద్యసేవలు మినహా మిగిలిన ఆసుపత్రులు వైద్యులు, సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్నాయి. ఒక్కో ఆసుపత్రిలో మెడికల్‌ ఆఫీ సర్‌, కాంపౌండర్‌, స్వీపర్‌ పనిచేయాల్సి ఉండగా మెడికల్‌ ఆఫీసర్‌లు 4 ఆసుపత్రుల్లో లేరు. ప్రత్తిపాడు ఆసుపత్రిలో కొన్నేళ్లుగా మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టు ఖాళీగానే ఉంది. ఏడాది కిందట దివిలి వైద్యాధికారిని ఇక్కడ వారానికి ఒకసారి వైద్య సేవలు అందించే విధంగా ఏర్పాట్లుచేశారు. తదనంతరం ఆ వైద్యాధికారిని దివిలికే పరిమితం చేయడంతో ఇక్కడ వైద్యా ధికారి లేకుండాపోయారు. దీంతో ఈ ప్రాంతంలోని రోగులకు హోమి యో వైద్యసేవలు అందుబాటులో లేకుండాపోయాయి. ప్రస్తుత వర్షకాలం సీజన్‌లో డెంగ్యూ, టైఫాయిడ్‌, మలేరియా, చికెన్‌గున్యా వంటి వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో శరీరంలో ప్లేట్‌లెట్స్‌ పెంచే హోమి యో వైద్యం స్థానికంగా లేకపోవడం వల్ల రోగులు ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. హోమియో వైద్యాధికారుల పోస్టు భర్తీకి రాష్ట్రవ్యాప్తంగా చర్యలు తీసుకున్నప్పటికీ కొందరు కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఈ నియామకంపై కోర్టుకు వెళ్లడంతో ఆ పోస్టుల భర్తీలో జాప్యం నెలకొన్నట్టు సమా చారం. ఇక్కడ వైద్యాధికారిని నియమించాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Sep 03 , 2024 | 12:41 AM