Share News

సమస్యలు పరిష్కరించాలని ఎంఈవో-2ల వినతి

ABN , Publish Date - Aug 29 , 2024 | 01:04 AM

మండల విద్యాశాఖాధికారి-2గా పనిచేస్తున్న తమ సమస్యలు పరిష్కరించాలని జిల్లాలోని ఎంఈవో-2లు అంతా డీఈవో ఎం.కమలకుమారికి వినతిపత్రం అందజేశారు.

 సమస్యలు పరిష్కరించాలని ఎంఈవో-2ల వినతి

ముమ్మిడివరం, ఆగస్టు 28: మండల విద్యాశాఖాధికారి-2గా పనిచేస్తున్న తమ సమస్యలు పరిష్కరించాలని జిల్లాలోని ఎంఈవో-2లు అంతా డీఈవో ఎం.కమలకుమారికి వినతిపత్రం అందజేశారు. జిల్లాలో మండల విద్యాశాఖాధికారి-2గా పనిచేస్తున్న వారంతా ముమ్మిడివరం ఎయిమ్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఎం.కమలకుమారిని కలిసి వినతిపత్రం అందించారు. జీవో నంబరు 89ప్రకారం 2023అక్టోబరు 30న జారీచేసిన జాబ్‌చార్టును పూర్తిగా రద్దుచేసి జీవో నంబరు 154ను, 2022 జూన్‌ 16 జారీచేసిన జీవోను అమలు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. గెజిటెడ్‌ హెడ్‌మాస్టారు లేదా ఎంఈవో-1 లేదా ఎంఈవో-2లు రిటైర్డ్‌ అయిన పక్షంలో సంబంధిత విద్యా సంస్థల్లో ఎంఈవో-2, ఎంఈవో-1 లేదా గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించాలని వారు విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఖాళీగా ఉన్న ఉపవిద్యాశాఖాధికారివారి పోస్టును సీనియర్‌ మోస్టు గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుడు లేదా సీనియర్‌ మోస్ట్‌ ఎంఈవో-1 లేదా ఎంఈవో-2లతో భర్తీ చేయాలన్నారు. బొజ్జా రమణశ్రీ, పెచ్చెట్టి శ్రీనివాస్‌, సానబోయిన ఏడుకొండలు, ఎస్‌.దుర్గాదేవి, కె.లీలావతి, వైవీ సత్యనారాయణ, చోడిశెట్టి ఆంజనేయులు, ఎస్‌.సత్యకృష్ణ, రాయుడు ఉదయభాస్కరరావు, మోకా ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 29 , 2024 | 01:04 AM