Share News

నాలుగేళ్లలో కానిది.. నాలుగు నెలల్లో అయింది!

ABN , Publish Date - Oct 15 , 2024 | 11:41 PM

గొల్లప్రోలు, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): తాగునీటికోసం విద్యార్థులు నాలుగేళ్లుగా పడుతున్న ఇ బ్బందులకు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ చొరవ తో పరిష్కారం లభించింది. నాలుగేళ్లుగా కానిది.. నాలుగు నెలల్లో పరిష్కారమైంది.. ఆర్వో ప్లాంటు వినియోగంలోకి వచ్చింది. గొల్లప్రోలు పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు కొంతకాలంగా తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో పా

నాలుగేళ్లలో కానిది.. నాలుగు నెలల్లో అయింది!
గొల్లప్రోలు జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో వినియోగంలోకి వచ్చిన ఆర్వో ప్లాంటు

డిప్యూటీ సీఎం చొరవతో

గొల్లప్రోలు జడ్పీ పాఠశాలలో

వినియోగంలోకి ఆర్వో ప్లాంటు

తాగునీటి సమస్యకు పరిష్కారం.. పవన్‌ సూచనతో

అధికార యంత్రాంగం చర్యలు

ఎక్స్‌లో పోస్ట్‌ చేసిన

డిప్యూటీ సీఎం కార్యాలయం

గొల్లప్రోలు, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): తాగునీటికోసం విద్యార్థులు నాలుగేళ్లుగా పడుతున్న ఇ బ్బందులకు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ చొరవ తో పరిష్కారం లభించింది. నాలుగేళ్లుగా కానిది.. నాలుగు నెలల్లో పరిష్కారమైంది.. ఆర్వో ప్లాంటు వినియోగంలోకి వచ్చింది.

గొల్లప్రోలు పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు కొంతకాలంగా తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో పాఠశాలకు ఆర్వో ప్లాంటు పంపినా దాన్ని వినియోగంలోకి తీసుకురాలేదు. ఆర్వో ప్లాంటులోకి తాగునీరు ఎలా వస్తుందన్న విషయాన్ని విస్మరించడంతో అది మూలనపడింది. అందులోని పరికరాలు పాడయ్యాయి. దీంతో విద్యార్థులు మధ్యాహ్న బోజన సమయంలో తాగునీరు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇంటినుంచి తెచ్చుకున్న నీటినే వినియోగించుకుంటున్నారు. పాఠశాలల్లో పరిస్థితులపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఇటీవల అధికారులతో ప్రత్యేక పరిశీలన చేయించారు. దీనిలోభాగంగా ఇక్కడి పాఠశాల విద్యార్థులు నాలుగేళ్లుగా తాగునీటికోసం పడుతున్న ఇబ్బందులు వెలుగులోకి వచ్చాయి. దీంతో కలెక్టరు షాన్‌మోహన్‌ స్పందించి సీఎస్‌ఆర్‌ నిధులనుంచి రూ.4లక్షలు ఇస్తామని, తక్షణం పనులు చేపట్టాలని పబ్లిక్‌హెల్త్‌ ఈఈ గంగరాజును ఆదేశించారు. నగర పంచాయతీ ఇంజనీరింగ్‌ అధికారులు పాఠశాలకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పాఠశాల ఆవరణలో ఉన్న నూతితోపాటు సమీపంలోని రైస్‌మిల్లులో ఉన్న నూతి నీటిని కాకినాడ ఆర్‌డబ్ల్యూఎస్‌ ల్యాబ్‌కు పరీక్షల నిమి త్తం పంపారు. రెండుచోట్ల తాగునీరు వినియోగానికి పనికి వస్తాయని నివేదిక రావడంతో పనులు ప్రారంభించి పూర్తి చేశారు. పాఠశాల ఆవరణలో ఉన్న నూతిలోని నీటిని శుభ్రం చేసి అక్కడే మోటార్‌ బిగించి ఆర్వోప్లాంటు వరకూ పైప్‌లైన్‌ ఏర్పాటు చేశారు. ఆర్వో ప్లాంటును బాగు చేయించారు. దీంతో అది వినియోగంలోకి వచ్చింది. ఏళ్ల తరబడి ఉన్న తాగునీటి సమస్య పరిష్కారం కావడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై డిప్యూటీ సీఎం కార్యాలయం ఎక్స్‌(ట్విట్టర్‌)లో పోస్టు చేసింది. ఈ విషయంలో జిల్లా యంత్రాంగం చూపిన చొరవను డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ అభినందించారు.

డంపింగ్‌యార్డు సమస్య పరిష్కారం దిశగా అడుగులు

ఎక్స్‌లో పోస్ట్‌ చేసిన డిప్యూటీ సీఎం కార్యాలయం

గొల్లప్రోలు, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): గొల్లప్రోలు పట్టణంలో సుదీర్ఘకాలంగా ఉన్న డంపింగ్‌యార్డు సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ కార్యాలయం ఎక్స్‌(ట్విట్టర్‌)లో మంగళవారం పోస్ట్‌ చేశారు. డంపింగ్‌యార్డు సమస్య శాశ్వత పరిష్కారం నిమిత్తం జిల్లా కలెక్టర్‌ పంపిన ప్రతిపాదనలను పవన్‌కల్యాణ్‌ ప్రభుత్వానికి నివేదించారు. త్వరలోనే వీటికి ఆమోదం లభించనున్నది. ఈలోగా ప్రస్తుతం 1.50 ఎకరాల్లో ఇషా ్టరాజ్యంగా వేస్తున్న చెత్తాచెదారాన్ని ఒక క్రమపద్ధతి 25సెంట్లులో వేసి పీహెచ్‌సీ, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, ఎస్సీ కాలనీకి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేయాలని పవన్‌ సూచించారు. దీనికి అనుగుణంగా పనులు చేపట్టినట్లు డిప్యూటీ సీఎం కార్యాలయం తెలిపింది.

Updated Date - Oct 15 , 2024 | 11:41 PM