Share News

‘చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటాం’

ABN , Publish Date - Nov 14 , 2024 | 12:55 AM

కాకినాడ రూరల్‌, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): రూరల్‌ మండలం తూరంగి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడు విద్యార్థినులపై అసభ్యకరంగా ప్రవర్తించిన విషయంపై స్పందించిన రాష్ట్రబాలల హక్కుల పరిరక్షణ కమిషనర్‌ సభ్యురాలు టి.ఆదిలక్ష్మి బుధవా రం పాఠశాలను సందర్శించారు. వి

‘చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటాం’
కార్యక్రమంలో మాట్లాడుతున్న బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యురాలు ఆదిలక్ష్మి

కాకినాడ రూరల్‌, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): రూరల్‌ మండలం తూరంగి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడు విద్యార్థినులపై అసభ్యకరంగా ప్రవర్తించిన విషయంపై స్పందించిన రాష్ట్రబాలల హక్కుల పరిరక్షణ కమిషనర్‌ సభ్యురాలు టి.ఆదిలక్ష్మి బుధవా రం పాఠశాలను సందర్శించారు. విద్యార్థినులతో మాట్లాడగా ఆంగ్ల ఉపాధ్యాయుడు మహమ్మద్‌ తానీషా వలీబాబా తమకు అసభ్యకర వీడియోలు చూపించేవాడని, బాలికలను అసభ్యకరంగా తాకేవాడని, తరగతి గది తలుపులు మూసివేసి విద్యాబోధన చేసేవాడని తెలిపారు. పరీక్షా పేపర్లను విద్యార్థులతో మూల్యాంకనం చేయించేవాడని తెలిపారు. ఆదిలక్ష్మి మాట్లాడు తూ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ మీకు సహకారం అందిస్తుందని, ఎవరైనా మీపట్ల అస భ్యకరంగా ప్రవర్తించినా, లైంగిక వేధింపులకు గురిచేసినా తమ దృష్టికి తీసుకువస్తే అటువంటి వారిపై పోక్సో చట్టం ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ప్రధానోపాధ్యాయిని కడలి విజయదుర్గ అధ్యక్షతన జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ, విద్యాశాఖ జిల్లా బాలల పరిరక్షణ విభాగం చైల్డ్‌ హెల్స్‌లైన్‌ 1098 సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు బాలల హక్కులు, పరిరక్షణ, బాలలపై జరుగుతున్న వేధింపులు అరికట్టడం, బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహనా సదస్సును నిర్వహించారు. బాలలు ఏమైనా సమస్యలుంటే 1098కి జమాచారమివ్వాలని సూచించారు. కార్యక్రమంలో వి ద్యాశాఖ అధికారులు వేణుగోపాల్‌, యేసుదాసు, విజయ, స్వర్ణసుధ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Nov 14 , 2024 | 12:55 AM