Share News

ఎమ్మెల్సీ అభ్యర్థి నారాయణరావును గెలిపించాలి

ABN , Publish Date - Nov 14 , 2024 | 12:56 AM

కాకినాడ సిటీ, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామిక వాదులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఎస్టీయూ, ప్రైవేటు స్కూల్స్‌, కళాశాలలు, వివిధ ప్రజా సంఘాలు బలపరిచిన ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి గంధం నారాయణరావును గెలిపించాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.సాయిశ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. కాకినాడ లేడీస్‌ రిక్రియేషన్‌ క్లబ్‌ ఆవరణలో బుధవారం ఉపాధ్యాయ సంఘాలు, ప్రైవేటు, పాఠశాలలు, కళాశాలల ప్రతినిధుల సమావేశం ఆయన అధ్యక్షతన

ఎమ్మెల్సీ అభ్యర్థి నారాయణరావును గెలిపించాలి
సమావేశంలో మాట్లాడుతున్న సాయి శ్రీనివాస్‌

ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయి శ్రీనివాస్‌ పిలుపు

కాకినాడ సిటీ, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామిక వాదులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఎస్టీయూ, ప్రైవేటు స్కూల్స్‌, కళాశాలలు, వివిధ ప్రజా సంఘాలు బలపరిచిన ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి గంధం నారాయణరావును గెలిపించాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.సాయిశ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. కాకినాడ లేడీస్‌ రిక్రియేషన్‌ క్లబ్‌ ఆవరణలో బుధవారం ఉపాధ్యాయ సంఘాలు, ప్రైవేటు, పాఠశాలలు, కళాశాలల ప్రతినిధుల సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్టీయూ వల్లే రాష్ట్రంలో కాంట్రాక్ట్‌ కార్మికుల వేతనాలు పెరిగాయన్నారు. వారి జీవితాల్లో వెలుగులు నింపాలని, వారిని రెగ్యులర్‌ చేయాలని పోరాటం చేస్తున్నామ న్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం ఉపాధ్యాయులందరూ సైనికుల్లా పని చేయాలన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాక మధు మాట్లాడుతూ పెద్దల సభకు పెద్దాయనను పంపుదామన్నారు. ప్రైవేటు స్కూ ల్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి, డిగ్రీ కళాశాలల యూనియన్‌ అధ్యక్షుడు ప్రసా ద్‌, విద్యాసంస్థల ప్రతినిధులు చలపతి, శివప్ర సాద్‌, శ్రీనివాస్‌, దొరబాబు, డానియల్‌బాబు, ప్రసంగించారు. అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థి గంధం నారాయణరావును సభకు పరిచయం చేశారు. సమావేశంలో ఉపాఽధ్యాయ, ప్రజా సం ఘాలు, విద్యాసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Nov 14 , 2024 | 12:57 AM