Share News

టీడీఆర్‌ కుంభకోణంపై విచారణ చేపట్టాలి

ABN , Publish Date - Nov 06 , 2024 | 12:33 AM

కాకినాడ సిటీ, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో కాకినాడ నగరంలో జరిగిన టీడీఆర్‌ బాండ్ల కుంభకోణంపై సమగ్ర విచారణ చేపట్టి నిందితులను శిక్షించాలని కాకి నాడ నగర టీడీపీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్లిపూడి వీరు, తుమ్మల రమేష్‌ మంగళవారం మున్సిపల్‌శాఖా మంత్రి పొంగూరు నా

టీడీఆర్‌ కుంభకోణంపై విచారణ చేపట్టాలి
మంత్రికి వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

మంత్రి నారాయణకు టీడీపీ నాయకుల వినతి

కాకినాడ సిటీ, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో కాకినాడ నగరంలో జరిగిన టీడీఆర్‌ బాండ్ల కుంభకోణంపై సమగ్ర విచారణ చేపట్టి నిందితులను శిక్షించాలని కాకి నాడ నగర టీడీపీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్లిపూడి వీరు, తుమ్మల రమేష్‌ మంగళవారం మున్సిపల్‌శాఖా మంత్రి పొంగూరు నారాయణ ను కోరారు. జిల్లా పర్యటన సందర్భంగా టీడీపీ కార్యాలయానికి విచ్చేసిన మంత్రి నారాయణను టీడీపీ నాయకులు కలిసి వినతిపత్రం సమర్పిం చారు. ఈ సందర్భంగా వీరు, రమేష్‌ మాట్లాడు తూ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి టీడీఆర్‌ బాండ్ల రూపంలో కాకినాడ కార్పొరేషన్‌ నిధులు రూ.500 కోట్లు దోచుకున్నా డన్నారు. దుమ్ములపేట ప్రాంతంలో ఎలక్ట్రిక్‌ సబ్‌స్టేషన్‌ పేరుతో ప్రైవేటు వ్యక్తులకు ఈ భూమిపై రూ.251కోట్లు టీడీఆర్‌ బాండ్లు మం జూరు చేయించి నగర ప్రజలు సొమ్ముల రూపంలో చెల్లించిన కష్టార్జితాన్ని ద్వారంపూడి స్వాహా చేశాడన్నారు. వీటన్నింటిపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గదుల సాయిబాబు, వొమ్మి బా లాజీ, దండుప్రోలు నాగబాబు, పంతాడి రాజు, మల్లాడి గంగాధరం, ఎండీ అన్సర్‌ పాల్గొన్నారు.

మంత్రికి మోహనవర్మ సత్కారం

జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా తొలిసారి కాకినాడ నగరానికి విచ్చేసిన రాష్ట్ర మున్సిపల్‌ శాఖా మంత్రి పి.నారాయణను టీడీపీ జిల్లా కార్యాల యంలో జిల్లా ప్రొఫెషనల్‌ వింగ్‌ అధ్యక్షుడు వనమాడి మోహనవర్మ మంగళవారం మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.

Updated Date - Nov 06 , 2024 | 12:33 AM