Share News

TDP: జగన్‌పై టీడీపీ సీనియర్‌ నేత బుచ్చయ్యచౌదరి ఫైర్‌

ABN , Publish Date - Jun 14 , 2024 | 12:56 PM

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫైర్‌ అయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. ఒక్క ఛాన్స్‌ అంటూ వచ్చిన జగన్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేశారని..

TDP: జగన్‌పై టీడీపీ సీనియర్‌ నేత బుచ్చయ్యచౌదరి ఫైర్‌

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు (YCP Chief), మాజీ సీఎం (Ex. CM) జగన్మోహన్ రెడ్డి (Jaganmohan Reddy)పై తెలుగుదేశం సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి (TDP Senior Leader Gorantla Buchaiah Choudary) ఫైర్‌ (Fire) అయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. ఒక్క ఛాన్స్‌ (One chance) అంటూ వచ్చిన జగన్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని (AP State) నాశనం చేశారని, నవరత్నాల పేరుతో ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


జగన్మోహన్ రెడ్డి చర్యలతో తెలుగు జాతి తీవ్రంగా నష్టపోయిందని, ఇప్పుడు రాష్ట్రాన్ని బాగుచేయాల్సిన అవసరం ఉందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభిప్రాయపడ్డారు. ఆ బాధ్యత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్నారని అన్నారు. సీఎంగా బాధ్యతలు తీసుకుంటూనే చంద్రబాబు పనులు ప్రారభించారని, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పలు కీలక ఫైళ్లపై సంతకాలు చేశారని, భారీగా ఉద్యోగాల భర్తీకి పనులు ప్రారంభించారని బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు.

40ఏళ్ల తన అనుభవానికి మంత్రి పదవి వస్తుందని ఆశించానని.. అయినా మంత్రి పదవి రాలేదని తనకు అసంతృప్తి లేదని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. సీఎం చంద్రబాబు మాటతప్పలేదు.. మడమ తిప్పలేదని.. తొలి సంతకంతోనే ఎన్నికల హామీలు నెరవేర్చారని, జగన్ సహా దోపిడీ చేసిన అధికారులను శిక్షించాలని బుచ్చయ్య చౌదరి కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జీ-7 సమ్మిట్‌కు హాజరైన ప్రధాని మోదీ.. ఇటలీలో బిజీ బిజీ..

గనుల శాఖలో రూ. 350 కోట్ల భారీ స్కాం..

హాట్ టాపిక్‌గా ఆదిమూలపు వ్యవహారం..

జగనన్న విద్యా కానుకపై చంద్రబాబు ఏమన్నారంటే..

టివి కేబుల్ ప్రాణాలను కాపాడింది: తెలుగు ప్రవాసీ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 14 , 2024 | 01:17 PM