బ్రహ్మాడ నాయకుని బ్రహ్మోత్సవం
ABN , Publish Date - Oct 21 , 2024 | 01:31 AM
ఆత్రేయపురం(ఆంధ్రజ్యోతి): కోనసీమ తిరుమల శ్రీదేవి భూదేవి సమేత వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి 12వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 21వ చవితి సోమవారం నుంచి 29 మంగళవారం వరకు తొమ్మిది రోజుల పాటు తిరుమల తరహాలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఎప్పుడూ లేని విధంగా ప్రచార మాధ్యమాల ద్వారా భక్తులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. అనకా
నేటి నుంచి వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు
ఘనంగా ఏర్పాట్లు
ఆకట్టుకుంటున్న విద్యుత్ దీపాలంకరణ
ఆత్రేయపురం(ఆంధ్రజ్యోతి): కోనసీమ తిరుమల శ్రీదేవి భూదేవి సమేత వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి 12వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 21వ చవితి సోమవారం నుంచి 29 మంగళవారం వరకు తొమ్మిది రోజుల పాటు తిరుమల తరహాలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఎప్పుడూ లేని విధంగా ప్రచార మాధ్యమాల ద్వారా భక్తులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. అనకాపల్లి నుంచి విజయవాడ వరకు జాతీయ రహదారుల వద్ద బ్రహ్మోత్సవ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. పట్టణ ప్రాంతంలో ఎల్‌ఈడీతో డిజిటల్ ప్రచారం నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే హోమాలకు యాగశాలను కూడా సిద్ధం చేశారు. వసంత మండపం ప్రాకార మండపాలలో బెంగళూరు పుష్పాలతో అలంకరించే పనిలో ప్రత్యేక నిపుణులు నిమగ్నమయ్యారు. వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం ఖండవల్లి రాజేశ్వరవరప్రసాదచార్యులు బ్రహ్మత్వంలో వేద పండితులు, అర్చకులు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. రావులపాలెం నుంచి బొబ్బర్లంక వాడపల్లి, లొల్ల ప్రాంతాలలో ముఖ ద్వారాలను ఏర్పాటు చేశారు. ఆలయాన్ని విద్యుత్ కాంతులతో శోభాయమానంగా తీర్చిదిద్దారు.
సాంస్కృతిక కార్యక్రమాలు
తొమ్మిది రోజుల పాటు నిర్వహించే స్వామివారి బ్రహ్మోత్సవాలకు వివిధ రాష్ర్టాలకు చెందిన కళాకారులు తమ ప్రదర్శనలు అందించనున్నారు. కేరళ విలక్ డ్యాన్స్, గురవై వేషాలు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారణాసి డ్యాన్సు, మహారాష్ట్ర వాయిద్యం, కరీంనగర్ తీన్‌మార్, తిరుపతి సేక్సోఫోన్, కేరళవాయిద్యం, డోలు సన్నాయి, భరతనాట్యం తదితర వాటిని ప్రదర్శించనున్నారు.
నేడు శేషవాహన సేవ
సోమవారం ఉదయం 9.30 నిమిషాలకు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అకల్మశ హోమం, సాయంత్రం ధ్వజారోహణతో బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తారు. రాత్రి 7.30కు పరావాసుదేవ అలంకరణతో శేషవాహనంపై శ్రీవారు తిరు వీధులలో విహరించనున్నారు. బ్రహ్మోత్సవాలలో సాంస్కృతిక ప్రదర్శనలు...
ప్రత్యేక ఏర్పాట్లు చేశాం..
వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రానికి నెల రోజుల క్రితమే ఉపకమినరుగా బాధ్యతలు స్వీకరించా.. వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాం. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలకు రెండు తెలుగు రాష్ర్టాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఒడిసా రాష్ర్టాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నాం. భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. ఉచిత దర్శనం, ప్రత్యేక దర్శనంతో పాటు స్వామివారి ప్రసాదాలు భక్తులకు అందించనున్నాం. స్వామివారి బ్రహ్మోత్సవాలు భక్తులు తిలకించేలా ఏర్పాట్లు చేపడుతున్నాం.