Home » Amalapuram
మద్యం దుకాణాల విషయంలో ప్రజాప్రతినిధులెవరూ జోక్యం చేసుకోవద్దని, ఎటువంటి మామూళ్లు వసూలు చేయవద్దని సీఎం ఇప్పటికే ఆదేశించారు. కానీ కొన్నిచోట్ల ఎమ్మెల్యేల పేరుతో వారి అనుచరులు, కుటుంబ సభ్యులు కొందరు వసూళ్లకు..
అమలాపురం, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): చెడు వ్యసనాలకు లోనై చిన్నతనం నుంచి చిన్నచిన్న చోరీలతో ప్రస్థానం ప్రారంభించిన దొంగలు అంతర్ జిల్లా స్థాయిలో వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలోని ప్రాంతాల్లో నేరాలకు పాల్పడిన ముగ్గురు సభ్యుల దొంగల ముఠాను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. డాక్టర్ బీఆ
ఆత్రేయపురం, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తజనం పొటెత్తారు. వేకుమజామునే స్వామివారికి సుప్రభాతసేవ, నీరాజన మంత్రపుష్పం, ఐశ్వర్యలక్ష్మిహోమం, భాలబోగం తదితర కార్యక్రమాలను శాస్రోక్తంగా నిర్వహించి వివిధ
ప్రపంచం అంతా మారిపోయింది.. డిజిటల్ వైపు పరుగులు పెడుతోంది.. ప్రస్తుతం రూపాయి చెల్లించాలన్నా ఆన్లైన్.. అయితే పంచాయతీల్లో మాత్రం ఇప్పటి కింకా పాత పద్ధతే. ఏ సేవ కావాలన్నా మాన్యువల్‌గా దరఖాస్తు చేయాల్సిందే.. వాళ్లూ అదే స్థాయిలో మాన్యువల్‌గా ధ్రువీకరణ పత్రం అందజేస్తారు. ఈ విధానానికి స్వస్తి పలకాలని కూటమి ప్రభుత్వం నిర్ణయిం చింది. దీనిలో భాగంగా డిజిటలైజేషన్ దిశగా అడుగులు వేస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 1103 పంచాయతీలు ఉండగా అన్నింటా ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఇక ఏ సేవ అయినా ఆన్లైన్లోనే. దీంతో గ్రామీణ ప్రజల కష్టాలు తీరునున్నాయి.. ఈ సేవలు జనవరి నుంచి అమల్లోకి వస్తాయి.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌పై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర, అనుచిత పోస్టులు పెట్టారనే ఆరోపణలతో సంచలన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై వరుస కేసులు నమోదవుతున్నాయి. కాపునాడు నాయకులు అమలపురంలో ఈరోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్‌ను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడాన్ని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఖండించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదులో వాసంశెట్టి వెనకబడి ఉండడం వల్లే సీఎం చంద్రబాబు అలా మాట్లాడాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.
ఆత్రేయపురం(ఆంధ్రజ్యోతి): కోనసీమ తిరుమల శ్రీదేవి భూదేవి సమేత వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి 12వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 21వ చవితి సోమవారం నుంచి 29 మంగళవారం వరకు తొమ్మిది రోజుల పాటు తిరుమల తరహాలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఎప్పుడూ లేని విధంగా ప్రచార మాధ్యమాల ద్వారా భక్తులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. అనకా
నగరాల్లో ఎటుచూసినా కాలుష్యం. కంటికి కనిపించకుండానే గాలిలో కలిసి హానికరంగా మారుతోంది. వాహనాల నుంచి వచ్చే పొగ కారణంగా పర్యావరణం దెబ్బతిం టోంది. గాలిలో తగ్గుతున్న నాణ్యతే దీనికి నిదర్శనం. దేశంలో చాలా నగరాల్లో ఏక్యూఐ (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) సంఖ్య 100 దాటుతోంది. ఇది ఆందోళన కలిగించే అంశమే. కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల్లోను ఈ సంఖ్య ఒక్కోసారి 100 దాటుతోంది. ఈ సమస్య పరిష్కారానికే కేంద్రం ఎలక్ర్టికల్ వాహనాలపై దృష్టి పెట్టింది. దీంతో నెమ్మదిగా వీటి అమ్మకాలు జోరందుకుంటున్నాయి. పెట్రోలు వాహనాలతో పోలిస్తే ఖర్చు తక్కువ. పర్యావరణహితం కూడా. ఇప్పుడిప్పుడే సామాన్యులు సైతం ‘ఈవీ’ధంగా అడుగులు వేస్తున్నారు. దీంతో ఈ-బైక్‌లు, ఈ-కార్లు, ఈ-ఆటోలు రోడ్ల మీద సందడి చేస్తున్నాయి.
పురోహితులంతా వేద మంత్ర పఠనాన్నే కాదు.. కొందరు యుద్ధ విద్యలోనూ ఆరితేరి ఉంటారన్నడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ.
జాతీయ రహదారి-216 విస్తరణ అభివృద్ధి పనులపై వస్తున్న అభ్యంతరాల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. పాశర్లపూడి, మామిడికుదురులలో వచ్చిన అభ్యంతరాలపై ఆయన కలెక్టరేట్లో గురువారం అధికారులతో సమీక్షించారు. విస్తరణ పనులకు అడ్డంకిగా ఉన్న భవన నిర్మాణాల విలువల గణనలో వ్యత్యాసాలు ఏమైనా ఉన్నాయేమో పునఃపరిశీలన చేసి తాజాగా నివేదిక అందించాలని ఆదేశించారు.