బీచ్‌లో చెత్త,వ్యర్ధాల సేకరణ
ABN , Publish Date - Sep 30 , 2024 | 12:19 AM
సర్పవరం జంక్షన్, సెప్టెంబరు 29: గాడిమొగ రిలయన్స్ ఇండస్ట్రీస్ కేజీ బీ6 ఆధ్వర్యంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో ఆదివారం కాకినాడ రూరల్ వాకలపూడి బీచ్‌లో సుమారు 2.5 కిలోమీటర్ల మేర బీచ్‌లో ఉన్న చెత్తా,ప్లాస్టిక్ వ్యర్ధాలను తొలగించారు. సముద్రతీరంలో సేకరించిన సుమారు 2 టన్ను చెత్తను సంచుల్లో వే
సర్పవరం జంక్షన్, సెప్టెంబరు 29: గాడిమొగ రిలయన్స్ ఇండస్ట్రీస్ కేజీ బీ6 ఆధ్వర్యంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో ఆదివారం కాకినాడ రూరల్ వాకలపూడి బీచ్‌లో సుమారు 2.5 కిలోమీటర్ల మేర బీచ్‌లో ఉన్న చెత్తా,ప్లాస్టిక్ వ్యర్ధాలను తొలగించారు. సముద్రతీరంలో సేకరించిన సుమారు 2 టన్ను చెత్తను సంచుల్లో వేసి స్థానిక సూర్యారావుపేట పంచాయతీ శానిటేషన్ వర్కర్ల ద్వారా డంపింగ్ యార్డుకు తరలించారు. కార్యక్రమంలో గాడిమొగ రిలయన్స్ ఆపరేషన్స్ హెడ్ ప్రవీణ్ నందగిరి, రిలయన్స్ రిలయన్స్ లేడీస్ క్లబ్ సభ్యులు, ఉద్యోగ కుటుంబ సభ్యులు, హెచ్‌ఆర్ హెడ్ జీ.శ్రీనివాసరావు, హెచ్‌ఆర్ టీమ్ చెరుకూరి భాస్కరరావు, సీఎస్‌ఆర్ హెడ్ కె.శివప్రసాద్, పి.సుబ్రహ్మణ్యం,రిలయన్స్ ఉద్యోగులు పాల్గొన్నారు.