AP Election Counting 2024: మరుకొద్ది సేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం
ABN , Publish Date - Jun 04 , 2024 | 06:54 AM
మరుకొద్ది సేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. అన్ని జిల్లాల్లోనూ ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట ప్రారంభం కానుంది. కౌంటింగ్ హాలులోకి సెల్ ఫోన్, ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతిని అధికారులు నిరాకరించారు. అన్ని నియోజకవర్గాలలో మద్యం విక్రయాలపై నిషేధం విధించారు.
ఏలూరు: మరుకొద్ది సేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. అన్ని జిల్లాల్లోనూ ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట ప్రారంభం కానుంది. కౌంటింగ్ హాలులోకి సెల్ ఫోన్, ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతిని అధికారులు నిరాకరించారు. అన్ని నియోజకవర్గాలలో మద్యం విక్రయాలపై నిషేధం విధించారు. ఏలూరు జిల్లాలో ఏడు అసెంబ్లీ, ఏలూరు లోక్ సభ స్థానానికి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఏలూరు సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్‌లో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు.
నెల్లూరులో కౌంటింగ్‌కి సర్వం సిద్ధమైంది. ప్రియదర్శిని కళాశాల వద్దకి చేరుకున్న అధికారులు, సిబ్బంది ఇప్పటికే చేరుకున్నారు. జిల్లాలో మొత్తం 8 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. గుంటూరు జిల్లా లో కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గుంటూరు జిల్లా కౌంటింగ్ నిర్వహించనున్నారు. నరసరావుపేట జేఎన్‌టీయూ కాలేజీలో పల్నాడు జిల్లా కౌంటింగ్ జరగనుంది. బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో బాపట్ల జిల్లా కౌంటింగ్ నిర్వహించనున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాలలో ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. రాయలసీమ యూనివర్సిటీలో కర్నూలు పార్లమెంట్, 8 అసెంబ్లీ స్ధానాల కౌంటింగ్ నిర్వహించనున్నారు.
Election Results : తెల్లారింది లెగండోయ్ !
Read more AP News and Telugu News