AP Election 2024: గుంటుపల్లి గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలకు క్షమాపణలు: మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్
ABN , Publish Date - Mar 27 , 2024 | 10:06 PM
ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ అధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని), మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘ నా వల్ల ఇబ్బందులు పడిన గుంటుపల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ముందుగా క్షమాపణలు చెపుతున్నాను’’ అని అన్నారు.
మైలవరం: ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ అధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని), మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘ నా వల్ల ఇబ్బందులు పడిన గుంటుపల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ముందుగా క్షమాపణలు చెపుతున్నాను. గతంలో మీరు ఇక్కడ ఎవరి వల్ల ఇబ్బందులు పడ్డారో ఆ వ్యక్తిని నేను దూరంగా ఉంచాను. అధికార పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నప్పటికీ మూడు రాజధానులకు వ్యతిరేకంగా మాట్లాడిన ఏకైక వ్యక్తిని నేనే. ప్రభుత్వ మధ్యం, ఇసుక పాలసీలను వ్యతిరేకించిన వ్యక్తిని కూడా నేనే’’ అని కృష్ణ ప్రసాద్ అన్నారు.
‘‘రాబోయే రోజుల్లో మీ వాడిగా మీలో ఒకడిగా మన పార్టీ అధినేత చంద్రబాబు నాయిడు గారి సారథ్యంలో తెలుగుదేశం పార్టీ విజయం కోసం మనందరం సమష్టిగా పనిచేద్దాం’’ అని కృష్ణ ప్రసాద్ పిలుపునిచ్చారు. మైలవరం నియోజకవర్గంలో టీడీపీ జెండాను ఎగరవేసి చంద్రబాబు నాయుడుకి కానుకగా ఇద్దామని అన్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి