Share News

AP Election 2024: సీఎం జగన్ ప్రమాణస్వీకార తేదీ ప్రకటించిన మంత్రి బొత్స సత్యనారాయణ

ABN , Publish Date - May 16 , 2024 | 08:41 PM

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీసీ గెలుస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ విశ్వాసం వ్యక్తం చేశారు. జూన్ 9 న విశాఖ వేదికగా జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని, అలా జరగాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. ‘‘ జున 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

AP Election 2024: సీఎం జగన్ ప్రమాణస్వీకార తేదీ ప్రకటించిన మంత్రి బొత్స సత్యనారాయణ

విజయవాడ: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీసీ గెలుస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ విశ్వాసం వ్యక్తం చేశారు. జూన్ 9 న విశాఖ వేదికగా జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని, అలా జరగాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. ‘‘ జున 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రాష్టంలో ప్రజలు మళ్లీ జగన్ అధికారంలోకి రావాలని అనుకుంటున్నారు. దేశంలో నూతన ట్రెండ్‌ని జగన్ తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో ఇంకా మంచి పాలన చేస్తాం. పథకాలు కొనసాగిస్తూ మరింత మంచి పాలనకి శ్రీకారం చుట్టబోతున్నాం. లబ్ది చేకూరుతేనే ఓటు వేయండని అడిగిన నాయకుడు జగన్. పెద్ద ఎత్తున మహిళలు వృద్ధులు ఓటు వేయడానికి ముందుకు వచ్చారు. పథకాలు పూర్తి స్థాయిలో మళ్లీ అమలు కావాలని ప్రజలు అనుకుంటున్నారు’’ అని బొత్స అన్నారు.


టీడీపీ కావాలని దాడులకి దిగుతోందని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అందుకే గవర్నర్‌కి ఫిర్యాదు చేశామని, తాము మంచి చేశాము కాబట్టి నమ్మకంంగా అధికారంలోకి వస్తామని చెబుతున్నట్టు పేర్కొన్నారు. ‘‘ఎన్టీఆర్, వైస్సార్ పాలన తర్వాత మంచి పాలన జగన్ అందిస్తున్నారు. మేము సహనంతో ఉన్నాం కాబట్టి టీడీపీ దాడులు ఎక్కువ చేస్తుంది. మా నాయకుడు ఒక్క పిలుపు ఇస్తే పరిస్థితి వేరుగా ఉంటుంది. మళ్లీ ప్రభుత్వం నడపాల్సింది మేము కాబట్టి సహనంతో ఉన్నాం. ప్రజల్లో మార్పు వచ్చింది. జగన్ ఇచ్చిన పథకాలు చూసి ఓటింగ్ శాతం పెరిగింది. మేము అణగారిన వర్గాలకు ఎన్నికల్లో అవకాశం ఇచ్చాం. టీడీపీ ఎంతమందికి టిక్కెట్లు ఇచ్చిందో బయటికి తీయండి. చెప్పింది చేస్తాడు కాబట్టి జగన్‌ని ప్రజలు నమ్మి మళ్ళీ గెలిపించబోతున్నారు.


హైటెక్ సిటీ కట్టింది ఎవరో నాకు తెలియదా.. నేను ఉమ్మడి రాష్టంలో మంత్రిగా చేశాను. ఈ ఆఫీస్ అప్‌డేట్ చేస్తే చంద్రబాబుకి ఏం అయింది. ఎన్నికల కమిషన్ పెడింగ్ పెట్టిన డీబీటీ పథకాల అమౌంట్ ఈ రోజు ఖాతాలో పడ్డాయి’’ అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

Updated Date - May 16 , 2024 | 08:41 PM