Andhra Pradesh: వాలంటీర్ల రాజీనామా వెనుక అసలు కథ ఇది..!
ABN , Publish Date - Apr 03 , 2024 | 05:26 PM
ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల రాజీనామా అంటూ హడావుడి కనిపిస్తోంది. దీనిని వైసీపీ (YCP) నేతలు రాష్ట్రవ్యాప్తంగా చర్చ నీయాంశం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడం కోసమని రూ.5వేల గౌరవ వేతనంతో వాలంటీర్లను నియమించారు. 50 నుంచి 100 కుటుంబాలకు ఒక వాలంటీ నియమించారు. ఈ వ్యవస్థతో కొన్ని లాభాలుంటే.. అంతే స్థాయిలో నష్టాలు ఉన్నాయనే విమర్శలు వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల రాజీనామా అంటూ హడావుడి కనిపిస్తోంది. దీనిని వైసీపీ (YCP) నేతలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడం కోసమని రూ.5వేల గౌరవ వేతనంతో వాలంటీర్లను నియమించారు. 50 నుంచి 100 కుటుంబాలకు ఒక వాలంటీ నియమించారు. ఈ వ్యవస్థతో కొన్ని లాభాలుంటే.. అంతే స్థాయిలో నష్టాలు ఉన్నాయనే విమర్శలు వచ్చాయి. మొత్తానికి వాలంటీర్లను నియమించి నాలుగేళ్లు అవుతుంది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల వేళ వాలంటీర్లు పార్టీల తరపున ఎన్నికల ప్రచారం చేయకూడదని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వారి విధుల విషయంలోనూ కొన్ని షరతులు విధించింది. పెన్షన్లను వాలంటీర్లతో కాకుండా ప్రభుత్వ ఉద్యోగులతో ఇప్పించాలని ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో వైసీపీ సరికొత్త కుట్రకు తెరలేపింది. విపక్షాలు వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇప్పించడం లేదని ఓ దుష్ప్ర చారాన్ని ప్రారంభించింది. దీనికి తోడు విపక్షాల తీరుకు నిరసనగా రాజీనామాలు చేస్తున్నామంటూ కొందరు వాలంటీర్లపై ఒత్తిడి తీసుకొచ్చి వైసీపీ నాయకులు వాలంటీర్లతో రాజీనామాలు చేయించారు. రాజీనామా తర్వాత జై జగన్, జై వైసీపీ నినాదాలు ఇస్తూ పార్టీ ప్రచారంలో పాల్గొంటున్నారు.
AP Pension: మరీ ఇంతలానా!.. టీడీపీని బద్నాం చేసేందుకు వృద్ధులను వాడేసుకున్న వైసీపీ
రాజీనామా వెనుక..
వైసీపీ నాయకులు ఐదేళ్లలో చేసిన అభివృద్ధి ఏమి లేకపోవడంతో పూర్తిగా తమ ప్రచారంలో వాలంటీర్లనే నమ్ముకున్నారు. ఎన్నికల సంఘం వాలంటీర్లపై ఆంక్షలు విధించడంతో చివరికి వాలంటీర్‌గా రాజీనామా చేసి పార్టీ ప్రచారంలో పాల్గొనాలని తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు వైసీపీ నాయకులు. మళ్లీ ప్రభుత్వం వస్తే వాలంటీర్లుగా మిమల్ని తీసుకుంటామని హామీ ఇస్తున్నారు. అయితే వైసీపీ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం లేదనే అంచనాల నేపథ్యంలో.. తాము రాజీనామా చేస్తే తరువాత తమ పరిస్థితి ఏమిటని కొందరు వాలంటీర్లు నిలదీస్తున్నారు. తాము ఏదో ఒకటి చేస్తామని.. ప్రస్తుతం రాజీనామా చేయాలని ఒత్తిడి పెడుతున్నారు. కొందరు రాజీనామా చేస్తుంటే.. మరికొందరు మాత్రం తమను ఒత్తిడి చేయవద్దని చెబుతున్నారట. ఓడిపోతామనే భయంతో ప్రజాస్వామ్య యుతంగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియను వైసీపీ నేతలు కలుషితం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వైసీపీ స్వార్థ ప్రయోజనాల కోసం
వైసీపీ నాయకుల రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం తమను ఎందుకు బలి చేస్తారంటూ కొందరు వాలంటీర్లు ఆవేదన చెందుతున్నట్లు తెలుస్తోంది. రాజీనామా చేయమంటే స్థానిక నాయకులు తమను బెదిరిస్తున్నారని కొందరు వాపోతున్నారు. తాము ఇంటర్వ్యూలకు వెళ్లి వాలంటీర్లుగా ఎంపిక అయ్యామని.. పార్టీ నాయకులు ఇప్పించలేదని, ఇప్పుడు మాత్రం రాజీనామా ఎందుకు చేయమంటున్నారని వాలంటీర్లు ప్రశ్నిస్తున్నారు. కొన్నిచోట్ల రాజీనామా చేసిన వాలంటీర్లకు పది వేల రూపాయిలను వైసీపీ నాయకులు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మొత్తానికి ఓడిపోతామనే భయంతో వైసీపీ నాయకులు రోజుకో కుట్రకు తెరలేపుతున్నట్లు తెలుస్తోంది.
Varla Ramaiah: సచివాలయానికి వచ్చి పెన్షన్ తీసుకోమనడం దుర్మార్గం: వర్ల రామయ్య
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..