Share News

Fourien Tour అన్నయ్య అటు .. చెల్లెమ్మ ఇటు..!

ABN , Publish Date - May 18 , 2024 | 06:32 PM

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎన్నికల ఫలితాల కోసం ఆ యా పార్టీ నేతలే కాదు... ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారంతా ఆతృతతో ఎదురు చూస్తున్నారు.

Fourien Tour అన్నయ్య అటు .. చెల్లెమ్మ ఇటు..!
YS Jagan Mohan Reddy, YS Sharmila

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎన్నికల ఫలితాల కోసం ఆ యా పార్టీ నేతలే కాదు... ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారంతా ఆతృతతో ఎదురు చూస్తున్నారు.

అన్నయ్య అటు.. చెల్లెమ్మ ఇటు..!

వైసీపీ అధినేత, సీఎం వైయస్ జగన్.. తాజాగా విదేశీ పర్యటనకు వెళ్లిపోయారు. అదీ కూడా సీబీఐ కోర్టు అనుమతి తీసుకుని ఆయన లగ్జరీ విమానంలో లండన్‌కు పయనమైయ్యారు. అయితే ఆయన సోదరి, పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల సైతం యూఎస్ వెళ్లిపోయినట్లు ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతుంది. కుమారుడు రాజారెడ్డి వివాహాం. ఆ కొద్ది రోజులకే పీసీసీ అధ్యక్షురాలిగా ఆమె బాధ్యతలు చేపట్టడం.. అనంతరం ఎన్నికలు నగరా మోగడం.. దీంతో ఎన్నికల ప్రచారంలో ఆమె అలుపెరగకుండా సుడిగాలి ప్రచారం నిర్వహించడంలో బిజీ బిజీగా ఉన్నారు.


కడప సీటు ఎవరిది..?

అదీకాక కడప లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వైయస్ షర్మిల బరిలో నిలిచారు. ఆ క్రమంలో తన రాజకీయ ప్రత్యర్థిగా సోదరుడు వైయస్ అవినాష్ రెడ్డి బరిలో నిలిచారు. అతడికి సీఎం వైయస్ జగన్ అండ దండ.. గా ఉన్నారు. దీంతో ఆ లోక్‌సభ స్థానాన్ని ఎవరు కైవసం చేసుకుంటారోనని అంశం ఆసక్తికరంగా మారింది.


నాడు నేడు ఎంత తేడా...?

మరోవైపు సరిగ్గా ఎన్నికల ప్రచారం ఊపందుకొగానే.. వైయస్ విజయమ్మ యూఎస్ వెళ్లిపోయారు. దీంతో వైయస్ విజయమ్మ యూఎస్ పర్యటన రాష్ట్ర పోలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే గత ఎన్నికల వేళ వైయస్ఆర్ సీపీ గెలుపు కోసం.. జగన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కించేందుకు వైయస్ విజయమ్మ, వైయస్ షర్మిలతోపాటు వైయస్ ఫ్యామిలీలోని వారంతా ఒక తాటిపైకి వచ్చి ప్రచారం నిర్వహించారు.

దీంతో ఆ వేళ వైయస్ జగన్ గెలుపు నల్లేరు మీద నడకే అయింది. కానీ నేడు.. అంటే ఈ ఎన్నికల సమయంలో పరిస్థితులందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. అదీకాక ఈ ఎన్నికల్లో వైయస్ విజయమ్మ ఎవరికి మద్దతుగా నిలుస్తారంటూ ఓ చర్చ సైతం జరిగింది.


విజయమ్మ వీడియో వైరల్

అయితే ఎన్నికల పోలింగ్‌కు కొద్ది రోజుల ముందు యూఎస్‌లో విజయమ్మ... ఓ వీడియోను విడుదల చేశారు. తన కుమార్తె వైయస్ షర్మిలకు మద్దతుగా నిలిచి ఓటు వేయాలంటూ కడప జిల్లా ప్రజలకు వీడియో సందేశం ద్వారా విజ్జప్తి చేశారు. అయితే పోలింగ్ ముగిసిన తర్వాత వైయస్ షర్మిల సైతం యూఎస్‌లోని తన కుమారుడు రాజారెడ్డి వద్దకు వెళ్లిపోయారు. తల్లి విజయమ్మ సైతం అక్కడే ఉన్నారు.


జూన్ 2, 3 తేదీల్లో తిరిగి రాక..

దీంతో ఎన్నికల ఫలితాలు వెలువడే ఒకటి రెండు రోజుల ముందు తల్లితోపాటు వైయస్ షర్మిల రాష్ట్రానికి తిరిగి వస్తారనే ప్రచారం సాగుతుంది. అలాగే సీఎం వైయస్ జగన్ సైతం విదేశీ పర్యటన ముగించుకొని ఫలితాల వెలువడే నాటికి తాడేపల్లిలోని ఆయన నివాసం చేరుకొనున్నారని సమాచారం.

అయితే పోలింగ్ పూర్తైన తర్వాత ఎవరు.. సప్త సముద్రాలు దాటి ఎంత దూరం వెళ్లినా.. వారి మనస్సు మాత్రం జూన్ 4 తేదీ.. చుట్టూనే పరిభ్రమిస్తుంటుందని రాజకీయ వర్గాల్లో ఓ చర్చ సైతం సాగుతుంది.

Read Latest National News and Telugu News

Updated Date - May 18 , 2024 | 10:09 PM